వావ్.. కివితో బోలెడన్నీ బెనిఫిట్స్.. రోజుకు ఒక్కటి తింటే చాలు లక్ష లాభాలు..!
కివీ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పోషకాల గనిగా పిలుస్తారు. కివీ పండులో విటమిన్ సి, కె మరియు విటమిన్ ,పొటాషియం,ఫైబర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. రెగ్యులర్‌గా కివీ పండు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు ప్రతి రోజూ ఒకటి తినటం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన పండును మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 12, 2025 | 9:35 PM

కివీ పండులో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ సమృద్దిగా ఉంటాయి. దీని వలన ఎముకలు బలంగా ఉంటాయి. కవీ పండ్లలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్‌ఫెక్షన్ల నుండి పోరాడే శక్తి పెరుగుతుంది.

పొటాషియం కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కివీ పండులో సమృద్దిగా ఉంటాయి. దీన వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఎంతో అవసరం. కివీ పండలో సెరటోనిన్ హార్మోన్ ఉంటుంది. దీని వలన మంచి నిద్ర కలుగుతుంది.

కివిలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పదార్థాలు చర్మాన్ని మెరుగుపరచడంలో, ముడతలను తగ్గించడంలో, చర్మం స్థితిస్థాపకతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. కివి తినడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.

కివీ పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కివీ పండ్లలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. కివీ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కివిలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు కివి తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.




