AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acne: వీపు, మెడపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి

యుక్తవయసులో ప్రతి ఒక్కరిలో కనిపిస్తే మొటిమలు సర్వ సాధారణ సమస్య. దీనికి మూలం హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాల మీద కూడా వస్తుంటాయి. మొటిమలు పోయినా, వాటి తాలూకు మచ్చ మిగిలిపోతుంది..

Acne: వీపు, మెడపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి
డా. భావుక్ ధీర్ ప్రకారం.. ముఖంపై మొటిమలు కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల, శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ సమతుల్యత చెదిరిపోతుంది. దీంతో ముఖంపై మొటిమలు వస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే యువత కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి.
Srilakshmi C
|

Updated on: Sep 16, 2024 | 12:59 PM

Share

యుక్తవయసులో ప్రతి ఒక్కరిలో కనిపిస్తే మొటిమలు సర్వ సాధారణ సమస్య. దీనికి మూలం హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాల మీద కూడా వస్తుంటాయి. మొటిమలు పోయినా, వాటి తాలూకు మచ్చ మిగిలిపోతుంది. యుక్తవయస్సులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ కారణం ఏమైనప్పటికీ, ఏడాది పొడవునా మొటిమలు ఉంటే, ముఖం మీద మాత్రమే కాకుండా తల, వెన్ను, మెడపై కూడా మొటిమలు ఉంటే సమస్యాత్మకంగా మారుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు నచ్చిన దుస్తులు వేసుకోవాలన్నా, ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ ధరించాలన్నా ఎబ్బెట్టుగా ఉంటుంది.ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లోనే దాగి ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కింది చిట్కాలు ట్రై చేసి చూడండి..

మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలకు అలోవెరాలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. బ్యాక్ మొటిమలను తొలగించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను తొలగించి, ఫ్రిజ్‌లో ఉంచాలి. కొంత సమయం తరువాత అది బాగా చల్లబడుతుంది. ఈ చల్లని కలబంద జెల్‌ను వీపుపై బాగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ పద్ధతి వారంలో 2-3 రోజులు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

బేకింగ్ కేక్‌ల నుంచి మేకప్ వరకు, ఫ్రైస్ క్రిస్పీగా చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా కూడా వీపు, మెడపై మొటిమలను వదిలించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి, ఈ మిశ్రమాన్ని వీపుపై రుద్దాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంలో కొద్ది రోజుల్లోనే మొటిమలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

తేనె – పాలు – ఈ రెండు పదార్థాలు సౌందర్య సంరక్షణలో చాలా మేలు చేస్తాయి. మెడపై మొటిమల సమస్య నివారణకు తేనె, పాలు కూడా ఉపయోగపడతాయి. పాలు – తేనె సమపాళ్లలో కలిపి, ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని వీపుపై అప్లై చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత దానిని కడిగిస్తే సరి. వారంలోనే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తగ్గిపోతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.