AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Current Bill Reduce Tips: ఏసీని వాడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.. విద్యుత్ బిల్లుని ఆదాచేయండి.

వేసవి వచ్చేసింది.. ఇక భానుడు భగభగమంటున్నాడు.. ఎండ వేడినుంచి ఉపశమనం కోసం ఏసీ వాడకం తప్పని సరి.. అయితే వేసివిలో రోజుల తరబడి ఏసీ వేసుకుంటే..

AC Current Bill Reduce Tips: ఏసీని వాడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.. విద్యుత్ బిల్లుని ఆదాచేయండి.
Ac In Summer
Surya Kala
|

Updated on: Mar 26, 2021 | 12:29 PM

Share

AC Current Bill Reduce Tips: వేసవి వచ్చేసింది.. ఇక భానుడు భగభగమంటున్నాడు.. ఎండ వేడినుంచి ఉపశమనం కోసం ఏసీ వాడకం తప్పని సరి.. అయితే వేసివిలో రోజుల తరబడి ఏసీ వేసుకుంటే.. విద్యుత్ బిల్లులు భారీగా వస్తాయి, మరోవైపు ఏసీ పని చేసే శక్తి సామర్ధ్యం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే.. ఏసీ వేసుకున్నా విద్యుత్ బిల్లు భారీగా రాకుండా చేస్తుంది.. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..!

1. ఈ సంవత్సరం ప్రారంభంలో, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఎసి తయారీదారులకు ఓ సూచన చేసింది.. తమ ఏసీ పరికరాల తయారీ సమయంలో డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24. C వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ముందు ఏసీల్లో డిఫాల్ట్ 20 డిగ్రీలు ఉండేది. అయితే ఏసీ ఉష్ణోగ్రతను పెంచే ప్రతి డిగ్రీకి 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక రూమ్ వెంటనే చల్లబడాలని 18 డిగ్రీలు పెట్టేస్తుంటారు. అయితే ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుంది. కనుక వినియోగదారుడు ఏసీని డిఫాల్ట్ ఉష్ణోగ్రతలో పెట్టుకుంటే.. 24 శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు

2. అయితే ఢిల్లీ, చెన్నై, ముంబై లేదా బెంగళూరు వంటి నగరాల్లో నివసిస్తుంటే.. అక్కడ సగటు ఉష్ణోగ్రత 34 డిగ్రీల C -38 డిగ్రీల C మధ్య ఉంటుంది. కనుక వినియోగదారుడు ఏసీని 10 డిగ్రీల తక్కువకు అమర్చడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఎదుకంటే మన శరీర ఉష్ణోగ్రత సగటు 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది, కనుక రూమైనా సహజంగానే మనకు చల్లదన్నాని ఇస్తుంది. ఎసిలో మనం తగ్గించే ప్రతి డిగ్రీకి 6 శాతం అదనంగా ఉష్ణోగతాను వాడుతున్నామని తెలుసు.. కనుక ఆ అలవాటుని మార్చుకుని.. 23°C-24°C లకు పెట్టుకోండి. అయినప్పటికీ మీ ఇల్లు ఖచ్చితంగా చల్లగా మారుతుంది.. 3. ముఖ్యంగా ఏసీని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఏసీ వేసుకోవటానికి ముందు.. రూమ్ లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి.. కిటికీలన్నీ మూసివేయాలి.. ఎండవేడి రూమ్ లోకి రాకుండా చూసుకోవాలి.. ఇక ఏసీ వేయడానికి ముందు ఎక్కువ వేడిని వెలువరించే ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ వంటివి ఆన్ లో లేకుండా చూడాలి. ఏసీ వేయడానికి ముందే వీటిని ఆఫ్ చేసుకోవాలి.. కొంచెం సేపు గది చల్లబడిన తర్వాత అప్పుడు వాటిని తిరిగి ఆన్ చేసుకోవచ్చు.

4.ఇక రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంటె కనుక రాత్రి ఎక్కువ సేపు ఏసీ వేసుకోవాలిన అవసరం ఉండదు.. రాత్రి వేళల్లో రెండు గంటలు ఏసీని వేసుకోండి.. తర్వాత రూమ్ చల్లబడుతుంది.. ఇక మరో రెండు మూడు గంటల పాటు ఏసీని ఆఫ్ చేసి ఉంచవచ్చు.. ఇలా చేయడం ద్వారా చాలా విద్యుత్ అదా అవుతుంది.

5. ఇక కొంత మంది రూమ్ లో ఏసీ వేసుకున్నా.. మరోవైప్పు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసుకుంటారు. అంతేకాదు.. ఆ గదిలో లైట్స్ ను ఆన్ చేసుకునే ఉంటారు.. దీంతో గది ఉష్ణోగ్రత తగ్గదు.. త్వరగా చల్లబడదు.. కనుక త్వరగా రూమ్ చల్లబడాలంటే.. ఫ్యాన్ తో పాటు.. లైట్స్ ను కూడా ఆఫ్ చేయాలి.. అప్పుడు ఏసీని వేసుకుంటే.. రూమ్ త్వరగా చల్లబడుతుంది.

6.ముఖ్యంగా ఏసీ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. దుమ్ము ధూళి ఉంటె ఏసీ పనిచేసే శక్తి తగ్గుతుంది.. కనుక ఎప్పటికప్పుడు ఏసీ ఫిల్టర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంతో విద్యుత్ వినియోగం 5 నుంచి 15 శాతం తగ్గుతుంది. అంతేకాదు ఏసీ పనితీరు బాగుంటుంది.. త్వరగా రిపేర్ రాకుండా కాపాడుతుంది.

Also Read: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…

అబ్బాయి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు.. ఒక్కటైన ప్రేమజంట.. కోర్టు సంచలన తీర్పు ఎక్కడంటే..!