uppula Raju |
Updated on: Mar 26, 2021 | 12:26 PM
దంపతుల మధ్య గొడవలు జరగడం కామన్. అయితే వాటినే పట్టుకొని కూర్చోకుండా ఒకరి కొకరు సారీ చెప్పుకోవడం చేస్తే బాగుంటుంది. అప్పుడే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగి స్వీట్ కపుల్స్‌గా మారుతారు.
భార్యాభర్తలు బయటికి వెళ్లినప్పుడు ఒకరు ముందుకు మరొకరు వెనుకకు నడుస్తూ ఉంటారు. అలా కాకుండా చేయి పట్టుకొని ఇద్దరు కలిసి నడిస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా భర్త తనపై చూపిస్తున్న ప్రేమకు భార్య ఎంతగానో సంతోషిస్తుంది.
ఇద్దరు కలిసి వంట చేయడం, వ్యాయామం చేయడం, సినిమాలు చూడటం వంటి పనులు చేస్తే ఒకరి అభిరుచులు ఒకరికి తెలుస్తాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి గడిపే సమయం పెరుగుతుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
భార్య విషయంలో ప్రతిసారి చిరాకుపడటం, కోపం చూపించడం వంటివి చేయకూడదు. ఎందుకంటే అవి వారి మనసులో బలంగా నాటుకొని పోతాయి. తద్వారా మనస్పర్ధలు ఏర్పడుతాయి. అందుకే ఏ విషయం అయినా సరే.. వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
ఇద్దరు ఏకాంతంగా గడపడానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. వారం లేదా పదిరోజులకు ఒకసారి బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఇవి పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటే వారి కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.