Hand Shower: హ్యాండ్ షవర్ వల్ల నీళ్లు లీక్ అవుతున్నాయా? ఈ మూడు టిప్స్‌తో సమస్య ఫసక్..!
మనం రెగ్యులర్‌గా వాడే టాయిలెట్‌లో హ్యాండ్ షవర్ పనితీరు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టాయిలెట్ ఉపయోగిస్తున్నప్పుడు నీరు అకస్మాత్తుగా కొన్నిసార్లు చాలా వేగంగా, కొన్నిసార్లు చాలా నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం నీటి లీకేజీ. నీరు లీకవడం అంటే నీరు వృథా అవుతున్నట్లే లెక్క ఒక్కోసారి నీరు జెట్‌ను నొక్కకుండానే బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య చిన్నదే.. కానీ పరిష్కరించడానికి ప్లంబర్ దొరకడం చాలా పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనమే హ్యాండ్ షవర్ వాటర్ లీక్‌ను ఎలా కట్టడి చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఇటీవలే టాయిలెట్‌కు సంబంధించిన హ్యాండ్ షవర్‌ను మార్చినప్పుడు అది మళ్లీ లీక్ అవుతుంటే అది చౌకైన ఉత్పత్తి అని గుర్తుంచుకోవాలి. మంచి కంపెనీ నుంచి కొనుగోలు చేసిన షవర్ అంత త్వరగా చెడిపోదు. లీకేజీ సమస్య తాత్కాలికం, కొన్ని రోజులు మార్కెట్‌కు వెళ్లడానికి మీకు సమయం లేకపోతే చింతించకండి. మీరు ఎటువంటి డబ్బు ఖర్చు చేయకుండా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. పాలిథిన్‌తో ఒక చిన్న బంతిని తయారు చేసి నీరు బయటకు వచ్చే లీకేజ్ భాగంలో ఉంచండి. నాజిల్ స్ప్రేయర్ పైపు నుంచి నీరు బయటకు వస్తుంటే మీరు అక్కడ ఒక క్లాత్‌ను కూడా అటాచ్ చేయవచ్చు. ఈ ఉపాయాలు పని చేయకపోతే కొత్తది కొనడం ఉత్తమం. లేకపోతే నీరు వృధా అవుతూనే ఉంటుంది.
కొన్నిసార్లు హ్యాండ్ షవర్‌కు సంబంధించిన అన్ని రంధ్రాల నుంచి నీరు సరిగ్గా బయటకు రాదు. కొన్ని రంధ్రాలు మూసుకుపోతాయి. నాలుగు నుండి ఐదు జెట్‌ల ద్వారా నీరు మాత్రమే బయటకు వస్తుంది. దీనివల్ల టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోవడం సాధ్యం కాదు. మీరు సేఫ్టీ పిన్ చొప్పించడం ద్వారా రంధ్రాలను తెరవవచ్చు. కొన్నిసార్లు మురికి అంటుకోవడం వల్ల సరిగ్గా నొక్కిన తర్వాత కూడా నీరు బయటకు రాదు.
కొన్నిసార్లు హ్యాండ్ షవర్ లోని కుళాయి భాగం నుంచి నీరు కారుతుంది. అంటే నాజిల్ బాగానే ఉంది. అంటే మీరు కుళాయిని ఆఫ్ చేసి ఉంచాలి. మీరు దానిని ఉపయోగించినప్పుడు మాత్రమే ట్యాప్‌ను ఆన్ చేయాలి. లేకపోతే రోజంతా నీరు వృథా అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..