అందాల మందారం ప్రయోజనాలు తెలిస్తే.. ఔరా అనాల్సిందే..! అందం, ఆరోగ్యంతో పాటు..
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ అందాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మందార పొడిలో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చనిపోయిన చర్మ కణానలను తొలగించి స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.

మందార.. మనందరికీ తెలిసినా ఒక అందమైన పువ్వు.. మందార పూలను దేవుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మందార మొక్క తప్పనిసరిగా ఉంటుంది. అయితే, మందార కేవలం పూజలకు మాత్రమే కాదు.. చర్మ సౌందర్యం, కేశ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తారని ఆయుర్వేదం చెబుతోంది. మందార పూలు, ఆకులను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. మందార పువ్వు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు మందార ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. అలాగే, మందార పూలతో చేసిన టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మందార పువ్వు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. మందారం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ముఖం అందంగా, చర్మం మెరిసేలా చేస్తుంది.
అంతేకాదు.. మందార పువ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గించుకోవచ్చు.. మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మందార మొగ్గలను రుబ్బి వాటి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ అందాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మందార పొడిలో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చనిపోయిన చర్మ కణానలను తొలగించి స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
మందార పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. చర్మంపై ఉండే ముడతలు, గీతలు తగ్గిపోతాయి. అలాగే చర్మం తేమగా ఉంటుంది. మందార పొడిలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మందార పొడిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. హైపర్పిగ్మెంటేషన్ సమ్యకు కూడా మందార మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..