Youth Gang War: స్నేహితులదినోత్సవం రోజున స్నేహం మరచి కర్రలతో దాడి చేసుకున్న యువకులు.. వీడియో వైరల్
Youth Gang War: సృష్టిలో తియ్యని స్నేహం.. నిజమైన స్నేహితుడు ఉన్న వ్యక్తి ఆగర్భ శ్రీమంతుడు.. స్నేహానికన్న మిన్న లోకాన ఇంకేదీ లేదు అటువంటి స్నేహనికి విలువ ఇస్తూ..
Youth Gang War: సృష్టిలో తియ్యని స్నేహం.. నిజమైన స్నేహితుడు ఉన్న వ్యక్తి ఆగర్భ శ్రీమంతుడు.. స్నేహానికన్న మిన్న లోకాన ఇంకేదీ లేదు అటువంటి స్నేహనికి విలువ ఇస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుంటే.. కొంతమంది స్నేహం మాటకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పెద్ద అర్ధాలు తీసుకుంటూ…ఇగోలకు పోతూ.. కొట్టుకోవడం చంపుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. తాజాగా స్నేహితుల దినోత్సవం రోజున స్నేహితులం అని చెప్పుకునే కొంతమంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ ఘటన కృష్ణా జిల్లాల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాటర్ ఫాల్స్ వద్దకు కొంతమంది యువకులు విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో యువకుల మధ్య మాటకు మాట పెరిగింది. దీంతో కిలేశపురం వద్ద యువకుల ఘర్షణకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దారుణ ఘటన సాయంత్రం 5:00 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను చూసిన యువకులు పరారయ్యారు. ఈ యువకుల దాడి చేసుకుంటున్న సమయంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు యువకులను గుర్తించే పనిలో ఉన్నారు.
Also Read: రెండు కాళ్ళు ఎత్తి .. కొమ్ములతో కుమ్ముకున్న రెండు ఆడ జింకలు.. ఆడోళ్ళు కదా అంటూ ఫన్నీ కామెంట్స్