AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: బయటకు వెళ్తున్నారా ? అయితే మీ బ్యాగ్‏లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఇవే..

వేసవి కాలం.. అందులోనూ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

Beauty Tips: బయటకు వెళ్తున్నారా ? అయితే మీ బ్యాగ్‏లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఇవే..
Summer Tips
Rajitha Chanti
|

Updated on: May 09, 2021 | 7:40 PM

Share

వేసవి కాలం.. అందులోనూ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితి వస్తేనే బయటకు వెళ్ళాడానికి సాహసం చేస్తున్నారు. ఇక ఎండాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు బారీగా పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ సోకడం ఏమో కానీ.. వడదెబ్బ, చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలు కోకొల్లలు. అయితే ప్రస్తుత పరిస్థితులలో మీరు బయటకు వెళ్ళెముందు ఈ వస్తువలను కూడా తీసుకెళ్ళడం ఉత్తమం. మరీ అవెంటో తెలుసుకుందామా.

* ఫేస్ మాస్క్.. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఫేస్ మాస్క్ శ్రీరామ రక్ష. ఇది మిమ్మల్నే కాదు.. మీ చుట్టూ ఉన్నవారిని కూడా కాపాడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఒక మాస్క్ వాడడం కంటే డబుల్ మాస్క్ వాడడమే మంచిది. అయితే ఈ వేసవిలో మాత్రం బ్లాక్ కలర్ మాస్క్ వాడకపోవడం మంచిది. ఎందుకంటే నలుపు ఉష్ణోగ్రతలను ఎక్కువగా పీల్చుకుంటుంది.

*. హ్యాండ్ శానిటైజర్.. ఎక్కువగా చేతులు కడుక్కోవడం.. ఏ వస్తువును ముట్టుకోవాలన్నా.. శానిటైజర్ వాడడం మంచిది. దీనివలన చేతులు శుభ్రంగా ఉండడమే కాకుండా.. ఇతర బ్యాక్టీరియా మన చేతుల్లోకి రాకుండా ఉంటుంది. అయితే బయటకు వెళ్ళేప్పుడు పాకెట్ శానిటైజర్ వాడడం మంచిది.

*. స్కార్ఫ్.. ఒక కాటన్ స్కార్ఫ్ దగ్గర ఉంటే ఎండలో బయటకి వెళ్ళేప్పుడు జుట్టుకి ఆ స్కార్ఫ్ రక్షణ ఇస్తుంది. జుట్టు ఎండలో మలమలా మాడిపోకుండా ఉంటుంది. కాటన్ స్కార్వ్స్ మాత్రమే తీసుకోవడం మంచిది. వేసవి కాలం లో ఇంకే వెరైటీలూ వాడడం కష్టం.

* కర్చీఫ్ టిష్యూలూ, వైప్స్ ఎన్ని ఉన్నా, కర్చీఫ్ ఉన్న దారే వేరు. మాటిమాటికీ వెట్ వైప్స్ తో ముఖం తుడుచుకోలేం, అవసరమైతే తప్ప. కానీ, ఒక మెత్తని కర్చీఫ్ తో అప్పుడప్పుడూ అలా అద్దుకుంటూ ఉంటే హాయిగా ఉంటుంది.

* సన్ గ్లాసెస్.. ఎండ నుండి కళ్ళకి కూడా ప్రొటెక్షన్ కావాలి, ఒక్కోసారి బయట ఎండకి కళ్ళు బైర్లు కమ్మినట్లు అయిపోతాయి. అలాంటప్పుడే సన్‌గ్లాసెస్ మనని రక్షిస్తాయి. ఇవి ఎప్పుడూ మీ బ్యాగ్ లో తప్పని సరిగా ఉండవలసిన ఐటమ్స్ లో ఒకటి.

* వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఏది లేకపోయినా ఇది మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. ఏక్కడ పడితే అక్కడి నీరు తాగకుండా ఉండటమే కాకుండా.. నీళ్ళ కోసం పరుగులు తీయాల్సిన శ్రమ ఉండదు. అందుకే వాటర్ బాటిల్ తప్పని సరి. చిన్న వాటర్ బాటిల్ మీ వెంట ఉంటే మీరు ప్రశాంతంగా వెళ్లిన పని చేసుకోవచ్చు.

* లిప్ బామ్.. లిప్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి. సన్ డ్యామేజ్ ని ఇవి తట్టుకోలేవు. అందుకే ఎప్పుడూ మీ లిప్స్ హైడ్రేటెడ్ గా ఉండాలి. కాబట్టి ఎస్‌పీఎఫ్ ఉన్న మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి, రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండండి.

* చిన్న గొడుగు..

ఎంత స్కార్ఫ్ ఉన్నా గొడుగును మించినది కాదు. అందుకే ఒక చిన్న గొడుగు వెంట ఉండడం మంచిది. చాలా చిన్నగా ముడిచేసి ఆ గొడుగుతో పాటూ వచ్చిన కవర్ లోనే పెట్టేయవచ్చు. ఎండ నుండి ప్రొటెక్ట్ చేయడానికి చిన్న గొడుగు కచ్చితంగా ఉండాల్సిందే. యాక్రిలిక్ కోటింగ్ ఉన్న గొడుగు తీసుకుంటే మీ ఫేస్ తో పాటు మీ హ్యాండ్స్ కి కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది.

* పెర్ఫ్యూమ్ / డియోడరెంట్..  ఇంట్లో ఎంత ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్ళినా బయటకి వెళ్ళి అరగంట అయ్యేప్పటికి మళ్ళీ స్నానం చేయాలేమో అన్నంత చెమట పట్టేస్తుంది. కొంచెమైనా ఫ్రెష్ గా ఉండాలంటే పెర్ఫ్యూమ్ కానీ డియోడరెంట్ కానీ మీ దగ్గర ఉండాల్సిందే.

* బాడీ మిస్ట్ వేసవి కాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. ఈ చెమటల్లో మనని రక్షించేది బాడీ మిస్ట్స్ మాత్రమే. ఇవ్ ఫ్రూటీ, ఫ్లవరీ, మస్క్ సువాసనల్లో లభిస్తాయి.

*జెర్మ్ ప్రొటెక్షన్ వైప్స్ బయట తిరుగుతున్నప్పుడు మనం ఎన్నో వస్తువులు తాకుతాం. అయితే, అవన్నీ పరిశుభ్రం గా ఉండకపోవచ్చు. అందుకే, మీకు జెర్మ్ ప్రొటెక్షన్ వైప్స్ కావాలి. మీ హ్యాండ్ బ్యాగ్స్ లో ఒక ప్యాకెట్ ఇవి ఉండేట్లు చూసుకోండి.

Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాలతో ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందండిలా..

రక్తంలో ఆక్సిజన్ తగ్గింతుందనే తెలిపే లక్షణాలు ఎంటో తెలుసా.. ఆక్జిజన్ స్థాయిలను పెంచడానికి ఇలా చేయండి..