యాదాద్రి స్తంభాలపై ఇక ‘సుదర్శన చక్రాలు’

యాదాద్రి స్తంభాలపై ఇక 'సుదర్శన చక్రాలు'

గుళ్ళలో దేవుళ్ళ బొమ్మలు, ఆధ్యాత్మికం ఉట్టిపడేలా కనిపించే చిత్రాలను చిత్రీకరించే కాలం చెల్లిపోతోందా.. నేటితరానికి, రేపటి తరానికి మార్గదర్శకాలుగా ఉంటాయని రాజకీయ నాయకులు, తాము అమలు చేసిన పధకాలను, తమ పార్టీ గుర్తులను గుడిలోని రాతి స్తంభాలపై చెక్కించి కొత్త ఒరవడిని సృష్టించాలనుకుంటున్నారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిర్మిస్తున్న అష్టభుజి ప్రాకార మండప రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో పాటు.. కారు.. సర్కారు బొమ్మలను రాతి స్తంభాలపై చెక్కిన వైనం బయటకు రావటంతో పెద్ద […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 12:55 PM

గుళ్ళలో దేవుళ్ళ బొమ్మలు, ఆధ్యాత్మికం ఉట్టిపడేలా కనిపించే చిత్రాలను చిత్రీకరించే కాలం చెల్లిపోతోందా.. నేటితరానికి, రేపటి తరానికి మార్గదర్శకాలుగా ఉంటాయని రాజకీయ నాయకులు, తాము అమలు చేసిన పధకాలను, తమ పార్టీ గుర్తులను గుడిలోని రాతి స్తంభాలపై చెక్కించి కొత్త ఒరవడిని సృష్టించాలనుకుంటున్నారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిర్మిస్తున్న అష్టభుజి ప్రాకార మండప రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో పాటు.. కారు.. సర్కారు బొమ్మలను రాతి స్తంభాలపై చెక్కిన వైనం బయటకు రావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాల నుంచి నెటిజన్ల వరకు అందరూ కూడా స్పందించి సోషల్ మీడియా వేదికగా ఏకిపడేశారు.

ఇక దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వివాదంగా మారిన ఈ వైనాన్ని సీరియస్‌గా పరిగణించి సంబంధిత చిత్రాలను తొలగించడానికి పూనుకుంది. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో ఆయన ముఖ చిత్రంతో పాటు పార్టీ చిహ్నాన్ని కూడా చెక్కిన శిల్పులు చివరకు తొలగించక తప్పలేదు.

ఇందులో భాగంగా కేసీఆర్ బొమ్మ స్థానే తాజాగా సుదర్శన చక్రాన్ని చెక్కాలని శిల్పులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిగిలిన వాటి స్థానాల్లో లతలు.. హంసలతో పాటు.. దైవ సంబంధిత బొమ్మల్ని చెక్కాలంటూ మార్కింగ్ లైన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారు స్థానంలో హంసను చెక్కటానికి ప్లాన్ చేశారు. ఆ మేరకు పనులు ప్రారంభించారని సమాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu