ప్చ్.. చంద్రయాన్ 2కు పాకిస్తానీల సపోర్ట్!

ప్చ్.. చంద్రయాన్ 2కు పాకిస్తానీల సపోర్ట్!

పాక్ ప్రధాని నుంచి మంత్రుల అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను దుయ్యపడుతుంటారు. అలాగే పాకిస్థానీలు కూడా భారత్ ఎందులోనైనా ఓడిపోతే.. ట్విట్టర్ వేదికగా వాళ్ళ కసిని తీర్చుకుంటారు. ఇది ఇలా ఉండగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. యావత్త్ ప్రపంచం ఈ చంద్రయాన్ 2 విజయం కోసం ఎదురు చూశాయి. అయితే ఆఖరి అంకంలోకి చేరేసరికి విక్రమ్ ల్యాండర్‌తో కనెక్షన్ కట్ అవ్వడం జరిగింది. దీనితో భారత శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 2:09 PM

పాక్ ప్రధాని నుంచి మంత్రుల అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను దుయ్యపడుతుంటారు. అలాగే పాకిస్థానీలు కూడా భారత్ ఎందులోనైనా ఓడిపోతే.. ట్విట్టర్ వేదికగా వాళ్ళ కసిని తీర్చుకుంటారు. ఇది ఇలా ఉండగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. యావత్త్ ప్రపంచం ఈ చంద్రయాన్ 2 విజయం కోసం ఎదురు చూశాయి. అయితే ఆఖరి అంకంలోకి చేరేసరికి విక్రమ్ ల్యాండర్‌తో కనెక్షన్ కట్ అవ్వడం జరిగింది. దీనితో భారత శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక తాజాగా విక్రమ్ లాండర్ చంద్రుడిపై ఉన్నట్లుగా గుర్తించారు. ఇది ఇలా ఉంటే భారతదేశం ఈ ప్రయోగంలో ఫెయిల్ అయిందని పాక్ మంత్రి సోషల్ తీవ్ర విమర్శలు చేయగా.. పాకిస్థానీలు ఆ మంత్రిని తిట్టిపోశారు. చంద్రయాన్ ప్రయోగాన్ని మెచ్చుకుంటూ వివేకంతో మాట్లాడారు.

భారతదేశం తనకు చేతకాని పని చేసి 1000 కోట్లు తగలేసిందని.. చేతకాకపోతే కామ్‌గా కూర్చోవడం మానేసి ఇలా ఖర్చుపెట్టడం ఎందుకని పాక్ మంత్రి ఫవాద్ చౌదరి భారతదేశాన్ని తిట్టిపోశారు. ఇక ఆయన ట్వీట్లపై స్పందించిన ఇండియన్స్ తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తూ భగ్గుమన్నారు. ఇక్కడ విచిత్రమేంటంటే పాకిస్థానీలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ క్షమాపణలు చెప్పడం గమనార్హం.

తాజాగా  పాకిస్థాన్‌కు చెందిన ఓ కాలమిస్ట్ అలీ మొయిన్ నవాజ్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో చంద్రుడు భూమి నుండి మూడు లక్షల 84 వేల 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక భారతదేశం తాను చేసిన ప్రయోగంలో చివరి రెండు కిలోమీటర్ల దూరంలో ఫెయిల్ అయింది. 0.0005463% ఉంటే అది మార్జిన్. 10 బిలియన్లలో వారు చంద్రునికి దగ్గరగా ఉన్న రోవర్‌ను సాధించగలిగారు. మేమింకా 73 బిలియన్‌లు ఖర్చుపెట్టిన పెషావర్ బి ఆర్ టీ ని తయారు చేయలేక పోయాము. ఇది ఆయుధాల యుద్ధం కాదు, భారత్ సాధించిన అభివృద్ధి అంటూ చేసిన ట్వీట్‌కు పాకిస్తానీల నుండి చాలా మంచి మద్దతు వచ్చింది. ఎవరూ చేయని సాహసం ఇండియా చేసింది. ఇండియా చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకోవాలని హితవు చెప్తున్నారు పాకిస్థానీలు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu