Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో సంగీత మాస్ట్రో ఇళయరాజాకు షాక్ తగిలింది. 1976-2001 మధ్య ఆయన స్వరపరచిన 134 సినిమాల పాటల ఆడియో హక్కులు సారెగామా మ్యూజిక్ సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నిర్మాతలు హక్కులను శాశ్వతంగా సారెగామాకు అమ్మేసినందున, కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజాకు యాజమాన్య హక్కులు లేవని కోర్టు తేల్చింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇళయరాజాకు ఉంది.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సారెగామా మ్యూజిక్ సంస్థతో ఇళయరాజాకు వివాదం ఉంది. తాజాగా కోర్టు 134 సినిమాల పాటలపై ఆంక్షలు విధించింది. తన సంగీతానికి సంబంధించి రాయల్టీ, పేటెంట్ హక్కుల కోసం ఇళయరాజా సినీ నిర్మాతలు, మ్యూజిక్ కంపెనీలపై న్యాయపోరాటం చేసారు. ఆయన కంపోజ్ చేసిన దాదాపు 134 సినిమాల సౌండ్ రికార్డింగ్స్, మ్యూజిక్ వాడకంపై కోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది. తనకే కాపీరైట్స్ ఉన్నాయని, ఇళయరాజా సాంగ్స్‌ను తన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయడం ఏంటని సారెగామా మ్యూజిక్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో రైట్స్ ఆడియో సంస్థ ‘సరిగమ’కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రొడ్యూసర్లు ఈ హక్కులను శాశ్వతంగా సారెగామాకు అమ్మేశారని, కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజాకు యాజమాన్య హక్కులు లేవని జస్టిస్ తుషార్ రావు గెడేలా తీర్పు ఇచ్చారు. నిజానికి కొంతకాలంగా తమిళ చిత్రాల కాపీరైట్ హక్కుల విషయంలో ఇళయరాజా, నిర్మాణ సంస్థల మధ్య పోరు నడుస్తోంది. తాను సృష్టించిన సంగీతంపై పూర్తి హక్కులు తనకే ఉంటాయని ఆయన వాదిస్తుండగా, తాము పెట్టుబడి పెట్టినందున ఆ హక్కులు తమకే దక్కుతాయని నిర్మాతలు వాదిస్తున్నారు. సారెగామా సంస్థకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు రావడంతో, డిజిటల్ మాధ్యమాల్లో ఆయన పాత సూపర్ హిట్ సాంగ్స్ వాడకంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఒక తమిళ పాట కాపీరైట్ విషయంలో వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం ‘ఎన్ ఇనియ పొన్ నిలావే’ అనే ఆల్‌టైమ్ హిట్ సాంగ్‌తో మొదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఇళయరాజా అనుమతులు ఇవ్వగా సారెగామా సవాల్ చేసింది. నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఈ క్రమంలో ఆ హక్కులు సారెగామాకు బదిలీ అయ్యాయి తఅని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని కోర్టు ఇళయరాజాకు కల్పించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!
With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్ సినిమా కలెక్షన్స్
పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..

