‘సాహో’ ఎఫెక్ట్.. ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడంటే.?

'సాహో' ఎఫెక్ట్.. ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడంటే.?

‘సాహో’.. ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 350 కోట్లతో నిర్మించిన ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు తప్ప.. కథ, కథనంలో కొత్తదనం లేకపోయేసరికి ప్రేక్షకుడికి రుచించలేదు. ఒక్క బాలీవుడ్ తప్ప.. మిగిలిన భాషల్లో బ్రేక్ ఈవెన్‌కు రావడం కూడా కష్టం అంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా.. ప్రభాస్ ఈ సినిమా ఎఫెక్ట్‌తో తన తదుపరి చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో క్రేజీ […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 1:55 PM

‘సాహో’.. ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 350 కోట్లతో నిర్మించిన ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు తప్ప.. కథ, కథనంలో కొత్తదనం లేకపోయేసరికి ప్రేక్షకుడికి రుచించలేదు. ఒక్క బాలీవుడ్ తప్ప.. మిగిలిన భాషల్లో బ్రేక్ ఈవెన్‌కు రావడం కూడా కష్టం అంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా.. ప్రభాస్ ఈ సినిమా ఎఫెక్ట్‌తో తన తదుపరి చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో క్రేజీ డైరెక్టర్ కాంబినేషన్‌లో చేయాలని భావిస్తున్నాడట.

దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఓ చిత్రం చేయడానికి ప్రభాస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘సాహో’ ఫెయిల్యూర్ కావడంతో ప్రభాస్ ఈ నిర్ణయానికి వచ్చాడని సమాచారం. డైరెక్టర్ రాధాకృష్ణ‌తో తెరకెక్కించే ‘జాన్’ ఇంకా పూర్తి కావడానికి చాలా టైం పడుతుండటం వల్ల పూరి జగన్నాధ్‌తో ఫాస్ట్‌గా ఓ సినిమా చేద్దామని భావిస్తున్నాడు ప్రభాస్. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత నిజముందో.?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu