అదో డిటెన్షన్ సెంటర్.. జైలుకు మరో పేరే ! అస్సాంలో అక్రమ వలసదారులకిక నరకమే !

అదో డిటెన్షన్ సెంటర్.. జైలుకు మరో పేరే ! అస్సాంలో అక్రమ వలసదారులకిక నరకమే !

అస్సాంలోని గోల్పార జిల్లాలో అక్రమ వలసదారులకు భారీ ఎత్తున నిర్బంధ శిబిరాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. దీన్ని శిబిరం అనడానికన్నా జైలని అనడమే బెటరంటున్నారు. బంగ్లాదేశ్, ఇతర విదేశాలనుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి, ఇక్కడి పౌరసత్వం లేక, ఎన్నార్సీ పుణ్యమా అని జనాభా లెక్కల్లో తమ పేర్లు లేక ఉసూరుమంటున్నవారిని ‘ నిర్బంధించడానికి ‘ సర్కార్ పెద్ద వ్యూహమే పన్నింది. ఇటీవలి ఎన్నార్సీలో దాదాపు 19 లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వీరు తమ జాతీయతను నిరూపించుకుని […]

Pardhasaradhi Peri

|

Sep 09, 2019 | 1:35 PM

అస్సాంలోని గోల్పార జిల్లాలో అక్రమ వలసదారులకు భారీ ఎత్తున నిర్బంధ శిబిరాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. దీన్ని శిబిరం అనడానికన్నా జైలని అనడమే బెటరంటున్నారు. బంగ్లాదేశ్, ఇతర విదేశాలనుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి, ఇక్కడి పౌరసత్వం లేక, ఎన్నార్సీ పుణ్యమా అని జనాభా లెక్కల్లో తమ పేర్లు లేక ఉసూరుమంటున్నవారిని ‘ నిర్బంధించడానికి ‘ సర్కార్ పెద్ద వ్యూహమే పన్నింది. ఇటీవలి ఎన్నార్సీలో దాదాపు 19 లక్షల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వీరు తమ జాతీయతను నిరూపించుకుని తిరిగి ‘ జనాభాలో తామూ ఒకరమని ‘.. చెప్పుకోవాలంటే ట్రిబ్యునల్స్, లేదా కోర్టులకు ఎక్కవచ్చునని, ఇందుకు 120 రోజుల వ్యవధిని ఇస్తున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఈ వలసదారుల్లో అనేకమంది అత్యంత పేదలు, నిరక్షరాస్యులు ఉన్నారు. తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోదామని అనుకున్నా .. ఇల్లీగల్ శరణార్థులుగా ముద్ర పడిన వీరిని అనుమతించడానికి ముఖ్యంగా బంగ్లాదేశ్ ఒప్పుకోవడంలేదు. వీరి అభ్యర్థనను అంగీకరించడానికి ఆ దేశం నిరాకరిస్తోంది. గోల్పార జిల్లాలో జరుగుతున్న నిర్బంధ శిబిర నిర్మాణంలో అనేకమంది శరణార్థులు కూలీలుగా పని చేస్తున్నారు. వీరికి అసలు తమ వయసెంతో కూడా తెలియదట..అక్షరం ముక్క రాని తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వీరు వాపోతున్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ లో దాదాపు మూడు వేల మందిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ స్కూలు, మెడికల్ సెంటర్ వంటివి నిర్మిస్తామని అధికారులు చెబుతున్నా అవి ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. వాటి ప్రయోజనాన్ని తాము ఎలా వినియోగించుకోవాలో కూడా వీరికి తెలియదు. ఈ శరణార్ధులు మళ్ళీ ఇతర ప్రాంతాలకు తరలకుండా అతిపెద్ద గోడను కూడా ఈ శిబిరం చుట్టూ నిర్మిస్తున్నారు. ఈ కూలీలకు రోజుకు సుమారు వంద లేదా 150 రూపాయల వరకు ఇస్తున్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నప్పటికీ.. తమకు అంత చెల్లించడం లేదని, ఇంతకన్నా తక్కువే ఇస్తున్నారని వీరు అంటున్నారు. తమ బాధలను తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదంటున్నారు.

Assam NRC 2

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu