పరీక్షలంటే భయమా..? ఈ సింపుల్ టిప్స్‌తో స్ట్రెస్ తుర్రుమనాల్సిందే
Samatha
18 February 2026
ఫిబ్రవరి ముగిసిపోయి, మార్చి నెల వస్తుందంటే చాలు పిల్లల్లో భయం మొదలవుతుంది. ఎందుకంటే? పరీక్షల సమయం ఆసన్నం అయినట్లే!
మార్చినెల ప్రారంభం
ఈ సమయంలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంటారు. దీంతో పిల్లల్లో ఒత్తిడి అధికం అవుతుంటుంది. పేపర్ ఎలా వస్తుందో, సిలబస్ చదవడం కంప్లీట్ చేయలేదని భయపడి పోతుంటారు.
పరీక్షల సమయం
ఇక కొంత మందికి అయితే పరీక్షలు అంటేనే భయం మొదలవుతుంది. అంతే కాకుండా విపరీతమైన ఒత్తిడికి గురి అవుతుంటారు. అయితే మీ పిల్లలను ఒత్తిడిని తగ్గించి పరీక్షలకు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా. బెస్ట్ టిప్స్ ఇవే.
పరీక్షల భయం
పిల్లల్లో ముందుగా పరీక్షలు అంటే భయం తొలిగించాలి. ఈ సమయంలో తప్పకుండా ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేసేలా చూడాలి.
భయం తొలిగించడం
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఒత్తిడి తగ్గిపోయి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. దీని వలన పిల్లలు పరీక్షలు బాగా రాయగలుగుతారు.
వ్యాయామం
అలాగే ఒత్తిడి అధికంగా ఉన్న సమయంలో లోతైన శ్వాస తీసుకోవాలి, లేదా యోగా చేయాలి. ఇది మీలోని ఆందోళన , ఒత్తిడిని తగ్గిస్తుంది.
యోగా
అదే విధంగా అధిక ఒత్తిడితో బాధపడుతుంటే, దాని గురించి ఇతరులతో మాట్లాడటం, మీలోని భావాలను ఇతరులతో పంచుకోవడం వలన ఒత్తిడి నుంచి త్వరగా బయటపడతారు.
ఇతరులతో పంచుకోవడం
ఇక ఒత్తిడి తగ్గాలి అంటే, ముఖ్యంగా నిద్ర తప్పనిసరి, చాలా మంది పిల్లలు పరీక్షల సమయంలో సరిగ్గా నిద్రపోరు, కానీ సరిగ్గా నిద్రపోవడం వలన ఒత్తిడి తగ్గి, ఆరోగ్యంగా ఉంటారు.