AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sahibzada Farhan :ట్వంటీ 20 వరల్డ్ కప్.. 57 బంతుల్లోనే సెంచరీ.. నమీబియా బౌలర్లను ఉతికి ఆరేసిన పాకిస్థాన్ ఓపెనర్

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. నమీబియాతో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పసికూన బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కెరీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు.

Sahibzada Farhan :ట్వంటీ 20 వరల్డ్ కప్.. 57 బంతుల్లోనే సెంచరీ.. నమీబియా బౌలర్లను ఉతికి ఆరేసిన పాకిస్థాన్ ఓపెనర్
Sahibzada Farhan T20 Century
Rakesh
|

Updated on: Feb 18, 2026 | 7:43 PM

Share

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. నమీబియాతో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పసికూన బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కెరీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద మార్కును అందుకున్న ఫర్హాన్, ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ ఈషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఫర్హాన్.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 58 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 172.4గా నమోదైంది. గతంలో అతని అత్యుత్తమ స్కోరు 80 పరుగులు కాగా, ఇప్పుడా రికార్డును అధిగమించాడు. ఫర్హాన్‌కు తోడుగా సైమ్ అయూబ్ (41 పరుగులు), కెప్టెన్ సల్మాన్ ఆగా (67 పరుగుల భాగస్వామ్యం), షాదాబ్ ఖాన్ (81 పరుగుల భాగస్వామ్యం) అండగా నిలవడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ ఇన్నింగ్స్‌లో బాదిన 4 సిక్సర్లతో ఫర్హాన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 4 మ్యాచ్‌లలో 11 సిక్సర్లు ఉన్నాయి. ఇంతకుముందు 10 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న ఈషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మెయిర్‌లను అతను రెండో స్థానానికి నెట్టేశాడు. అంతేకాదు, ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ ఫర్హాన్ టాప్‌లోకి దూసుకొచ్చాడు. 4 మ్యాచ్‌ల్లో 220 పరుగులతో అతను నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నాడు.

ఈ రేసులో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (178 పరుగులు) రెండో స్థానంలో ఉండగా, టీమిండియా ఓపెనర్ ఈషాన్ కిషన్ 158 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఫర్హాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం పాకిస్థాన్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అటు బ్యాటింగ్ పవర్‌తోనూ, ఇటు సిక్సర్ల వేగంతోనూ అతను వరల్డ్ కప్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్.. దరఖాస్తు ఇలా..
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. ఉప్పల్‌లో రికార్డుల వేట..!
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
ఆ హీరో కారణంగానే టాలీవుడ్ సినిమాల్లో గుర్తింపు..
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
మగవాళ్లు కూడా సున్నితమైన వారే.. వారిని ఏడిపించే 12 విషయాలివే
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
అత్యంత తెలివైన వారు కూడా ప్రేమలో పడితే మూర్ఖులుగా మారుతారా?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
పీఎఫ్ ఖాతా నుండి నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే క్రీమీ కోల్డ్ కాఫీని ఇలా చేయండి
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది?
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే - అన్నాడీఎంకే చర్చలు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!
అమెజాన్‌లో మరో గ్రేట్ సమ్మర్ సేల్..ఊహించని విధంగా డిస్కౌంట్లు..!