Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు
20 ఏళ్ల ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ సంచలన కేసులో తెరపడింది.
20 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు చెప్పింది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థిస్తూ సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి లో ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష చనిపోయారు. చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని… ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ… నిందితుడిపై 306 సెక్షన్ కింద ఆత్మహత్యకు పురిగొల్పడం, 309 సెక్షన్ కింద ఆత్మహత్యకు యత్నించడం.. ఈ వివరాలతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల జైలు, 5 వేల రూపాయలు జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా… జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!
With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్ సినిమా కలెక్షన్స్
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

