గురూ.. ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. అయితే మీ జీవితం అప్పుల పాలే!
Samatha
18 February 2026
ఇంటి వద్ద మొక్కలు ఆ ఇంటికే అందాన్ని తీసుకొస్తాయి. అంతే కాకుండా కొన్ని సార్లు అవి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి.
ఇంట్లో మొక్కలు
ఇక ఇంటి వద్ద మొక్కలు ఉంటే ఆనందం, ఆరోగ్యమే కాకుండా ఇవి వాస్తును కూడా ప్రభావం చేస్తాయి. కొన్ని మొక్కలు లక్కును తీసుకొస్తే, మరికొన్ని మొక్కలు మాత్రం సమస్యలు తీసుకొస్తాయంట.
ఆనందం
అందుకే కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణంలో అస్సలే పెంచకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ ఐదు రకాల మొక్కలు ఇంట్లో ఉంటే అప్పుల సమస్యలు పెరుగుతాయంట. అవి ఏవి అంటే?
ఇంటి వద్ద ఉండకూడని మొక్కలు!
ఆడవారికి చేతులకు అందాన్ని ఇచ్చే గోరింటాకు మొక్క ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదంట. దీని వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
గోరింటాకు మొక్క
జిల్లేడు మొక్కలు కూడా ఇంట్లో ఉండకూడదంట. ఇవి ఇంటిలో ఉండటం వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే, ఆర్థిక నష్టాలు ఎక్కువ ఉంటాయి.
జిల్లేడు మొక్క
కొంత మంది ఇంటి ముందు చింత చెట్టు పెంచుకుంటారు. కానీ ఇంటి ముందు చింత చెట్టు ఉండటం వలన అది ఇంటిలో పేదరికానికి దారితీస్తుందంట.
చింత చెట్టు
ఇక కొందరు షోకేజీ కోసం ఇంటిలోపల ముల్ల మొక్కలు పెట్టుకుంటారు. కానీ వీటి వలన కుటుంబంలో సమస్యలు అధికం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.
ముల్ల మొక్కలు
అలాగే బొన్సాయ్ మొక్కను కూడా ఇంటిలో అస్సలే పెంచుకోకూడదంట. దీని వలన ప్రతికూల శక్తి పెరిగి, ఆర్థిక , అనారోగ్య సమస్యలు పెరుగుతాయంట.