AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైసెన్స్ లేదని.. ట్రక్కు డ్రైవర్‌కు రూ. 86వేలు ఫైన్

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టం.. వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడో రూల్స్ తప్పిన వారిపై ఇప్పుడు జరిమానా విధిస్తున్నారు. నిలుచోబెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓడిశాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు అక్షరాల 86,500 రూపాయలు జరిమానా విధించారు అక్కడి అధికారులు. నాగాలాండ్‌కు చెందిన బీఎల్‌ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జేసీబీని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా.. ఒడిశాలోని […]

లైసెన్స్ లేదని.. ట్రక్కు డ్రైవర్‌కు రూ. 86వేలు ఫైన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 09, 2019 | 4:42 PM

Share

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టం.. వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడో రూల్స్ తప్పిన వారిపై ఇప్పుడు జరిమానా విధిస్తున్నారు. నిలుచోబెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓడిశాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు అక్షరాల 86,500 రూపాయలు జరిమానా విధించారు అక్కడి అధికారులు.

నాగాలాండ్‌కు చెందిన బీఎల్‌ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జేసీబీని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తుండగా.. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ట్రక్కును అధికారులు పట్టుకున్నారు. ట్రక్కు యజమాని అశోక్ జాదవ్‌కు భారీ ఫైన్ వేశారు. అశోక్‌కు లైసెన్స్ లేదని గుర్తించిన అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు రూ. 5 వేలు, 18 వేల టన్నుల అదనపు బరువును తీసుకెళుతున్నందుకు రూ. 56 వేలు, పరిమితికి మించిన లోడుతో వెళుతున్నందుకు 50 వేల రూపాయలు, సాధారణ తప్పిదాలకు మరో 5వందల రూపాయలు, మొత్తం కలిపి రూ. 86,500 జరిమానా విధించారు. కాగా కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రాగా, ఒడిశా ప్రభుత్వం అదే రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చింది. అయితే మొదటి నాలుగురోజుల్లోనే రూ. 88 లక్షలు జరిమానా కింద వసూలు చేసి.. దేశంలోనే అత్యధిక మొత్తం జరిమానా వసూలు చేసిన రాష్ట్రంగా నిలిచింది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..