AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balka Suman: మంత్రి కాన్వాయ్‌పై దాడి .. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్!

తెలంగాణలో గత 24గంటలుగా తీవ్ర దుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ సహా మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది.

Balka Suman: మంత్రి కాన్వాయ్‌పై దాడి .. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్!
Balka Suman Remanded 14 Days
Anand T
|

Updated on: Feb 18, 2026 | 7:08 PM

Share

మంత్రి వేవెక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో నలుగురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో బాస్క సుమన్‌తో సహా మరో నలుగురిని రిమాండ్‌కు తీసుకోనున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌కు నిరసనగా రేపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బందులో పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పేర్కొంది. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హారీష్‌ రావు సైతం బాల్క సుమన్‌ అరెస్ట్‌ను ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పిరికిపంద చర్యగా కేటీఆర్ పేర్కొన్నారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు బాల్క సుమన్ అరెస్ట్ పార్టీ సీనియర్ నేత హరీష్‌ రావు తప్పు బట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిందనే అక్కసుతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. అధికార, పోలీస్‌, ధన బలంతో కాంగ్రెస్ చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని హరీష్‌రావు అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్