AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Insurance: సామాన్యుడికి శ్రీరామరక్ష.. నెలకు రూ.36తో రూ.2 లక్షల జీవిత బీమా! అర్హతలు ఇవే..

కుటుంబ పెద్ద లేని లోటు ఏ శక్తి పూడ్చలేదు, కానీ ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు బీమా అండగా ఉంటుంది. కేవలం నెలకు రూ.36 (ఏడాదికి రూ.436) వంటి అతి తక్కువ ధరకే రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ 'ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన'లో ఎవరెవరు చేరవచ్చు? క్లెయిమ్ ప్రక్రియ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Life Insurance: సామాన్యుడికి శ్రీరామరక్ష.. నెలకు రూ.36తో రూ.2 లక్షల జీవిత బీమా! అర్హతలు ఇవే..
Pmjjby Eligibility
Bhavani
|

Updated on: Feb 18, 2026 | 7:07 PM

Share

నేటి అనిశ్చిత కాలంలో కుటుంబ ఆర్థిక భద్రత అనేది అత్యంత కీలకం. అధిక ప్రీమియంలు చెల్లించలేక బీమాకు దూరంగా ఉంటున్న సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అతి తక్కువ మొత్తంతోనే భారీ బీమా ప్రయోజనాన్ని పొందే అవకాశం కలుగుతుంది.

ఏ కారణంతో మరణించినా బీమా వర్తింపు!

ఈ పథకంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యం, ఆత్మహత్య వంటి ఏ ఇతర కారణాల వల్ల మరణించినా నామినీకి రూ.2 లక్షల బీమా మొత్తం అందుతుంది. ఇది ఒక ‘ప్యూర్ టర్మ్’ పాలసీ, అంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు కానీ మరణానంతరం కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసా లభిస్తుంది.

ఎవరు అర్హులు?

వయసు: 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న భారతీయ పౌరులందరూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఖాతా: ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.

లింకేజీ: ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

పరిమితి: ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లు ఉన్నా, కేవలం ఒక బ్యాంకు ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది.

ప్రీమియం వివరాలు ఇలా..

ఈ పథకానికి ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. అంటే నెలకు సగటున రూ.36 మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి ఏటా మే 25 నుంచి 31 మధ్య మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో-డెబిట్ పద్ధతిలో ఈ మొత్తం కట్ అవుతుంది. మీరు పథకంలో చేరే నెలను బట్టి మొదటి ఏడాది ప్రీమియం మారుతూ ఉంటుంది. 55 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ బీమా కవరేజీని కొనసాగించవచ్చు.

క్లెయిమ్ ఎప్పుడు చేసుకోవచ్చు?

కొత్తగా ఈ పథకంలో చేరిన వారు నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాతే (లీన్ పీరియడ్) సాధారణ మరణాలకు క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. అయితే, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మాత్రం వెంటనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

మీకు ఖాతా ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీసును సంప్రదించి ఒక చిన్న ఫారమ్ నింపడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్న వారు కూడా విడివిడిగా ప్రీమియం చెల్లించి ఈ లబ్ధి పొందవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు. పూర్తి వివరాల కోసం మీ బ్యాంకును సంప్రదించండి.

Follow Us
నెలకు రూ.36 కడితే మీ ఫ్యామిలీ సేఫ్! ఈ ఇన్సూరెన్స్ మీకుందా?
నెలకు రూ.36 కడితే మీ ఫ్యామిలీ సేఫ్! ఈ ఇన్సూరెన్స్ మీకుందా?
సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌
సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌
అతనొక హీరోనా..! ఎన్ని కోట్లు ఇచ్చిన ఆయనతో కలిసి నటించను..
అతనొక హీరోనా..! ఎన్ని కోట్లు ఇచ్చిన ఆయనతో కలిసి నటించను..
మంత్రి కాన్వాయ్‌పై దాడి .. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్!
మంత్రి కాన్వాయ్‌పై దాడి .. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్!
ఈ పెళ్లిలో ఓ ఏలియన్‌ ఉంది.. 7 సెకన్లలో గుర్తించండి
ఈ పెళ్లిలో ఓ ఏలియన్‌ ఉంది.. 7 సెకన్లలో గుర్తించండి
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..రోహిత్ రికార్డుపై హార్దిక్ కన్ను
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..రోహిత్ రికార్డుపై హార్దిక్ కన్ను
జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
AI రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అదానీ గ్రూప్!
AI రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అదానీ గ్రూప్!
ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?
ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?