Gold Loan: 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం వస్తుంది? నెలవారీ ఐఎంఐ ఎంత? పూర్తి క్యాలిక్యులేషన్
Gold Loan: బంగారంపై రుణం తీసుకోవడం ఈ రోజుల్లో మరింత సులభం అయిపోయింది. నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. చాలా తక్కువ సమయంలో చేతిలో డబ్బులు ఉండాలంటే బంగారం రుణమే సరైన మార్గం. కష్ట కాలంలో ఆర్థిక భరోసానిస్తుంది. బంగారాన్ని తనాఖా పెట్టి రుణం పొందవచ్చు..

Gold Loan: అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం ఉంటే బ్యాంకు రుణం పొందడం కొంత కష్టమైన పని. ఈ సమయంలో ముందుగా గుర్తుకు వచ్చేది గోల్డ్ లోన్. బంగారంపై రుణాలు సులభంగా లభిస్తాయి. ఎందుకంటే పెద్దగా ప్రాసెస్ లేకుండా, సిబిల్ స్కోర్ అవసరం లేకుండా నిమిషాల్లోనే రుణం పొందవచ్చు. అదే బ్యాంకు రుణం అయితే ఎంతో ప్రాసెస్. చివరకు అది మంజూరు అవుతుందా? లేదా అనేది గ్యారంటీ ఉండదు. అదే బంగారంపై రుణం మరింత సులభం. చాలా తక్కువ సమయంలో చేతిలో డబ్బులు ఉండాలంటే బంగారమే సరైన మార్గం. కష్ట కాలంలో ఆర్థిక భరోసానిస్తుంది. బంగారాన్ని తనాఖా పెట్టి రుణం పొందవచ్చు. ప్రస్తుత 2026 ఫిబ్రవరిలోని బంగారం ధరల ఆధారంగా చూసుకుంటే మీ దగ్గర ఉన్న 10 గ్రాముల బంగారంతో ఎంత రుణం పొందవచ్చు? అలాగే నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు బంగారం విలువ ఆధారంగా లోన్ ఇస్తుంటాయి. అయితే పూర్తి విలువకు తగినట్లు లోన్ ఇవ్వవు. బంగారం మార్కెట్ విలువలో కొంత శాతం తక్కువగా రుణం ఇస్తాయి. దీనినే లోన్ టు వాల్యూ రేషియో అంటారు. ఉదాహరణకు రూ. 2.5 లక్షల లోపు చిన్న రుణాలకు 85 శాతం వరకు ఎల్‌టీవీ రేషియో ఉంటుంది. ఇక రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అయితే 80 శాతం ఎల్‌టీవీ ఉంటుంది. అంతకు మించి లోన్ తీసుకోవాలంటే 75 శాతం వరకు అందిస్తారు.
10 గ్రాముల బంగారంపై ఎంత లోన్ వస్తుంది?
మీరు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై లోన్ తీసుకోవాలనుకుంటే అందులోని రాళ్లు, పూసలు, ఇతరాలను బరువు నుంచి తీసేస్తారు. ఆ తరువాత వచ్చే స్వచ్ఛమైన పసిడి బరువును లెక్కలోకి తీసుకుంటారు. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1.44 లక్షల స్థాయిలో ఉంది. దీనిపై గరిష్ఠ లోన్ విలువ 85 శాతం LTV ప్రకారం చూసుకుంటే రూ. 1,20,000 వరకు వస్తుంది. సాధారణ రుణం 75 శాతం నుంచి 80 శాతం ఎల్‌టీవీ రేషియోలో అయితే రూ.1,05,000 నుంచి రూ.1,12,000 వరకు లభిస్తుంది. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల ప్రకారం సులభంగా రూ.1 లక్ష నుంచి రూ.1,20,000 మధ్య బంగారం రుణం పొందవచ్చు. అయితే ఈ రుణం అన్ని వేళల్లో ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు హెచ్చు తగ్గుల కారణంగా కొంత ఎక్కువ తక్కువ రావచ్చని గుర్తించుకోండి.
10 గ్రామలు లోన్‌పై ఈఎంఐ ఎంత ఉంటుంది?
ఇక 10 గ్రాముల బంగారంపై రుణం తీసుకుంటే లక్ష రూపాయలకు ఏడాదికి లెక్కిస్తే 10 శాతం వడ్డీ రేటు ఉంటే నెలవారీ EMI రూ.8792 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బంగారంపై రుణం తీసుకుంటే మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అసలు, వడ్డీ కలిపి నెల నెలా చెల్లించడం, నెల నెలా వడ్డీ మాత్రమే చెల్లించడం. నెలనెలా వడ్డీ కడుతూ అసలు మొత్తాన్ని ఒకే సారి చెల్లించడం.
వడ్డీ రేట్లు చాలా తక్కువ:
ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే బ్యాంకులో వ్యక్తిగత రుణం కంటే బంగారంపై పొందే రుణాలకు వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. ఇక ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి ప్రైవేట్ సంస్థల్లో 9.50 శాతం నుంచి 18 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే ఈ వడ్డీ రేట్లలో తేడా ఉంటుంది. ఎందుకంటే తులం బంగారంపై తక్కువగా తీసుకుంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




