AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!

Term Insurance: అప్పుల భారం నుండి కుటుంబాన్ని రక్షించడానికి ఈ ఇన్సూరెన్స్ ఒక సమర్థవంతమైన పరిష్కారం. నెలకు సుమారు రూ.1000 ప్రీమియంతో1 కోటి రూపాయల వరకు అందుకోవచ్చు. మీరు ఉన్న అప్పుడు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాదు కుటుంబానికి భరోసాగా ఉంటుంది..

Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!
Term Insurance
Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 4:10 PM

Share

Term Insurance: ఈ రోజుల్లో చాలా మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. కారణం పెరుగుతున్న ఖర్చులు. చాలా మందికి నెలవారీ జీతం కూడా సరిపోవడం లేదు. పైగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు సతమతమవుతున్నాయి. అప్పుల భారం ఉన్నప్పుడు ఊహించని సంఘటనలు జరిగితే కుటుంబ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన సహజం. మీ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకోకుండా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక సరైన మార్గమని నిపుణులు పదేపదే చెబుతుంటారు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడనుంది. నెలకు సుమారు రూ.1000 చెల్లించడం ద్వారా మీరు మీ అప్పులను తీర్చాల్సిన అవసరం లేకుండా మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచవచ్చు.

ఉదాహరణకు మీకు రూ.60 లక్షల బ్యాంకు లోన్ ఉంటే రూ.1 కోటి కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ దురదృష్టవశాత్తు మీకు ఏదైనా జరిగితే, బీమా సంస్థ మీ కుటుంబానికి రూ.1 కోటి అందిస్తుంది. ఈ మొత్తంలో మీ కుటుంబం రూ.60 లక్షల అప్పును తీర్చివేయగలదు. మిగిలిన రూ.40 లక్షలు కుటుంబ ఆర్థిక అవసరాలకు తోడ్పడి, వారికి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది.

ఇది కూడా చదవండి: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు 26 సంవత్సరాల వయస్సు వారికి రూ.1 కోటి కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి సుమారు రూ.12,000 నుండి రూ.13,000 ఉంటుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మీ వయస్సు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. అందుకే ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేసుకోండి. అయితే మీరు ఇంకా ముందుగానే ఇన్సూరెన్స్‌ను తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలలోపే ఉంటుంది.

ఇది కూడా చదవండి: Multibagger: తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!

ఇలా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నట్లయితే మీకు ప్రమాదం జరిగినా కుటుంబానికి భరోసా ఉంటుంది. వారు ఉప్పుల్లో కూరుకుపోవాల్సిన అవసరం ఉండదు. కుటుంబానికి ఈ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంతో భద్రత ఇస్తుంది. అయితే తక్కువ వయస్సు ఉన్నప్పుడు ఇలాంటి పాలసీ తీసుకున్నట్లయితే మీరు చెల్లించే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది మీ వార్షిక ప్రీమియం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రీమియం కూడా వార్షికంగా లేదా నెలకు, మూడు, ఆరు నెలలకోసారి కూడా కట్టుకోవచ్చు. అయితే మీ వయస్సును బట్టి ప్రీమియంలో మార్పులు ఉండవచ్చు.

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్
శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్
Bank Account ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
Bank Account ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలవే..
డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలవే..
వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త
వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త