బందరులో మిస్సింగ్.. హైద‌రాబాద్‌లో డెడ్‌బాడీ

బందరులో క‌నిపించ‌కుండాపోయిన ఓ మహిళ హైద‌రాబాద్‌లో హత్యకు గురైంది. ఆగంత‌కులు ఆమెను కిడ్నాప్‌ చేసి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం మ‌ర్డ‌ర్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బందరులో మిస్సింగ్.. హైద‌రాబాద్‌లో డెడ్‌బాడీ
Ram Naramaneni

|

Sep 05, 2020 | 4:25 PM

బందరులో క‌నిపించ‌కుండాపోయిన ఓ మహిళ హైద‌రాబాద్‌లో హత్యకు గురైంది. ఆగంత‌కులు ఆమెను కిడ్నాప్‌ చేసి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం మ‌ర్డ‌ర్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే..మచిలీపట్నం సర్కిల్‌పేటకు చెందిన పల్లపోతు పద్మజ (45) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవినం సాగిస్తోంది. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుప‌డిన‌ ఆమె భర్త ఈనెల ఒకటో తేదీన పద్మజ మిస్సింగ్‌పై ఇనగుదురుపేట పోలీసులకు కంప్లైట్‌ చేశారు. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మ‌హిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అక్క‌డ ద‌ర్యాప్తు సాగుతుండ‌గానే, ఈ నెల 1వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పీఎస్ ప‌రిధిలోని ఓ ఏరియాలో గుర్తుతెలియని కాలిన‌ మహిళ మృతదేహం ల‌భ్య‌మైంది. దీనిపై అక్క‌డి పోలీసులు కేసు న‌మోదు చేసి..ద‌ర్యాప్తు ప్రారంభించారు. విచార‌ణ‌లో ఆ మృతదేహం పద్మజదిగా నార్కట్‌పల్లి పోలీసులు ఐడెంటిఫై చేశారు. స‌మాచారాన్ని ఇనగుదురుపేట పోలీసులకు చేర‌వేశారు. అదే విష‌యాన్ని ఇనగుదురుపేట పోలీసులు సైతం నిర్ధారించారు. కుటుంబ క‌లహాల నేప‌థ్యంలో ఆమెను అయిన‌వారే చంపేశార‌ని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu