అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం: రాబర్ట్ ఓబ్రెయిన్
రాజకీయంగా అమెరికాను ప్రభావితం చేసే అత్యంత భారీ ప్రణాళిక చైనా వద్ద ఉందని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ శుక్రవారం అన్నారు.

రాజకీయంగా అమెరికాను ప్రభావితం చేసే అత్యంత భారీ ప్రణాళిక చైనా వద్ద ఉందని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ శుక్రవారం అన్నారు. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, ఇందుకు భారీ కుట్రనే పన్నుతోందని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. ఇవన్నీ అమెరికా ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనాతో పాటు ఇరాన్, రష్యా దేశాలు కలిసి పన్నాగం పన్నుతున్నాయని రాబర్ట్ అన్నారు.
అమెరికాను లక్ష్యంగా చేసుకుని చైనా భారీ సైబర్ ఎటాక్ కార్యకలాపాలను చేపడుతోందని రాబర్ట్ ఓబ్రెయిన్ చెప్పారు. ఏదేమైనా, అమెరికా వాటిని సమర్థవంతం తిప్పికొట్టి, చివరికి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. అమెరికన్ ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే ఎవరైనా అసాధారణ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని మిస్టర్ రాబర్ట్ అన్నారు.
ఆగస్టు ఆరంభంలో.. యుఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ విలియం ఇవానినా మాట్లాడుతూ, యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అంచనాల ప్రకారం, నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని చైనా కోరుకుంటుందని, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ జోను ఓడించేందుకు రష్యా కృషి చేస్తోందని ఆరోపించారు.
