AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన 41ఏళ్ల నర్స్.. స్కాన్‌ రిపోర్ట్‌తో డాక్టర్స్‌కే మతిపోయింది..!

మన నిజ జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే కొన్ని సంఘటనలు నమ్మడానికి కష్టమైన అద్భుతాలను కలిగిస్తాయి. అలాంటి ఒక అరుదైన అద్బుతమైన సంఘటనకు సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది ఒక గర్భిణి విషయంలో వెలుగు చూసిన వింత. అంతేకాదు.. ఈ ఘటన యావత్‌ వైద్య రంగాన్ని సైతం విస్తుపోయేలా చేస్తుంది. వైద్యులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక మహిళ గర్భాశయం వెలుపల పెరుగుతున్న శిశువుకు జన్మనిచ్చింది. ఇది నిజంగా మిరాకిల్‌ అంటున్నారు వైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే...

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన 41ఏళ్ల నర్స్.. స్కాన్‌ రిపోర్ట్‌తో డాక్టర్స్‌కే మతిపోయింది..!
Abdominal Pregnancy Miracle
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 2:04 PM

Share

ఒక అమెరికన్ మహిళ ప్రసవానికి కొన్ని రోజుల ముందు తాను గర్భవతి అని తెలుసుకుంది. ఆశ్చర్యకరంగా శిశువు ఆమె ఉదరం లోపల, గర్భాశయంలో కాకుండా ఒక తిత్తిలో పెరుగుతోంది వైద్యులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన 41 ఏళ్ల నర్సు సూజ్ లోపెజ్‌కు చాలా కాలంగా పెద్ద అండాశయ తిత్తి ఉంది. ఈక్రమంలోనే ఆమె కడుపు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. ఆమె అది తిత్తి అని భావించింది. ఆమెకు వాంతులు కాలేదు, వికారం అనిపించలేదు. శిశువు కదలికలు కూడా ఏమాత్రం తెలియలేదు. ఆమెకు ఋతు చక్రం ఇప్పటికే సక్రమంగా లేదు. కాబట్టి, పీరియడ్స్‌ రాకపోవడం మామూలే అనుకుంది. నెలల తరబడి ఆమె తన భర్తతో సాధారణ జీవితాన్ని గడిపింది. విదేశాలకు కూడా ప్రయాణించింది. కానీ, ఒక రోజు తీవ్రమైన కడుపు నొప్పి, ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమె తిత్తిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది.

తిత్తిని తొలగించేందుకు గానూ డాక్టర్స్‌ ఆమెకు అన్ని టెస్ట్‌లు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె, ఆమె భర్త ఇద్దరూ షాక్ అయ్యారు. స్కాన్‌లో గర్భాశయం పూర్తిగా ఖాళీగా ఉండటం కనిపించింది. కానీ, ఆమె ఉదరం లోపల దాదాపు పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు ఉంది. అది కటి గోడకు అత్తుకుని ఉందని వైద్యులు గుర్తించారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, గర్భాశయం వెలుపల గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం. అలాంటి సందర్భాలలో తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని చెప్పారు. ఉదరంలో అభివృద్ధి చెందుతున్న గర్భాలు చాలా అరుదు. అలాంటి శిశువు పూర్తి తొమ్మిది నెలలు ఉండటం దాదాపు అసాధ్యం అంటున్నారు. వైద్య చరిత్రలో ఈ కేసు అత్యంత అరుదైనది వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 18న, వైద్యుల బృందం ఎంతగానో శ్రమించి ఆమెకు ఆపరేషన్‌ చేశారు. 22 పౌండ్ల బరువున్న తిత్తితో పాటు కడుపులోని బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. సర్జరీ సమయంలో సూజ్ చాలా రక్తాన్ని కోల్పోయింది. కానీ సకాలంలో రక్త మార్పిడి ఆమె ప్రాణాలను కాపాడింది. ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చునని వైద్యులు చెప్పిన సూచన మేరకు ఆమె భర్త, సహా కుటుంబ సభ్యులంతా దేవుడిపై భారం వేసి ఎదురు చూశారు. గంటల తరబడి వైద్యులు పడిన శ్రమకు ఫలితం దక్కింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. 8 పౌండ్ల బరువున్న ఆ బిడ్డకు ర్యు అని పేరు పెట్టారు. ఈ బిడ్డ తమ జీవితంలో అతిపెద్ద వరం అని కుటుంబం చెబుతోంది. సూజ్ లోపెజ్ తాను అద్భుతాలను నమ్ముతానని, ఈ బిడ్డ దేవుని అత్యంత విలువైన బహుమతి అని చెబుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..