WHO distorts Indian map: భారతదేశ మ్యాపు విషయంలో డబ్ల్యూహెచ్‌వో పొరబాటు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

మన దేశ మ్యాపు విషయంలో ఓ పొరపాటు చేసిన డబ్ల్యూహెచ్‌వో విమర్శల పాలైంది.

WHO distorts Indian map: భారతదేశ మ్యాపు విషయంలో డబ్ల్యూహెచ్‌వో  పొరబాటు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2021 | 10:47 PM

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం విషయంలో పెద్ద దిక్కుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నవ్వులపాలైంది. ప్రపంచంలో ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించే డబ్ల్యూహెచ్‌వో.. మన దేశం విషయంలో ఓ పొరపాటు చేసి విమర్శల పాలైంది. విశ్వవ్యాప్తంగా కరోనా మహమ్మారి వికృతరూపం కొనసాగుతుంది. కోట్లాది మంది ఈ రాకాసి కోరల్లో చిక్కుకున్నారు.

అయితే, ఇటీవలే ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కడెక్కడ ఎలా ఉందో చూపిస్తూ.. ఓ కలర్ కోడెడ్ మ్యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ఈ మ్యాప్‌లో మన దేశం మొత్తాన్ని ఓ రంగులో చూపించింది. అయితే ఇక్కడే ఓ పొరబాటు జరిగింది. దేశంలో ఇటీవలే ఏర్పడిన జమ్మూకశ్మీర్, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను మన దేశంతో సంబంధం లేకుండా వేరే రంగులో డబ్ల్యూహెచ్‌వో చూపించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సమస్యపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘‘ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలు, సూచనలు పాటించే సాధ్యమైనంత వరకూ మ్యాపులు తయారు చేస్తాం’’ అని వివరణ ఇచ్చింది. అంతే, ఇక నెటిజన్లు ఐక్యరాజ్య సమితిని కూడా వదలలేదు. జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారత్‌లో భాగాలుగా ఐక్యరాజ్య సమితి ఎందుకు గుర్తించడంలేదని విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఐక్యరాజ్య సమితి జమ్మూకశ్మీర్, లడఖ్‌లు భారతదేశంలో అంతర్ భాగంగా అంగీకరించడం లేదా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.