AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్.. పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

కరోనా వైరస్‌ను నివారించడానికి దేశంలో వ్యాక్సినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌...

గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్.. పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2021 | 6:28 AM

Share

కరోనా వైరస్‌ను నివారించడానికి దేశంలో వ్యాక్సినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీలో వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు రాష్ట్రస్థాయి కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలోనూ, కర్నూలు, కడప, గుంటూరు విశాఖపట్నంలలో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని 18 జిల్లాలలో మొత్తం 1,659 కోల్డ్ స్టోరేజ్ చెయిన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ రవాణా కోసం ప్రస్తుతం 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రతతో 19 రిఫ్రిజరేటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధంగా ఉంచారు. వ్యాక్సినేషన్ కోసం ఎఎన్ఎంలు 17,012 మంది, మొత్తం వ్యాక్సిన్ సెంటర్లు 7,469 సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 6 వాకిన్ కూలర్స్ , 2 వ్యాక్సిన్ ఫ్రీజర్స్ , 65 భారీ డీప్ ఫ్రీజర్‌లు పంపించింది.

అయితే వీటితో పాటు 7,108 కోల్డ్ బాక్సులు, లక్షా 50 వేల 700 జన్ ప్యాక్ లు పంపాల్సిందిగా కేంద్రాన్ని ఏపీ అధికారులు కోరారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ నెల వరకూ ఎనిమిది నెలల పాటు నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన వ్యాక్సిన్ డోస్ లు, వాటి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంచనాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

ఏపీలో వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించేందుకు ఆరోగ్య వైద్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి 15 రోజులకోసారి భేటీ కానుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి సోమవారం సమావేశం కానున్నారు.

నగర పాలక సంఘస్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసిల్దార్ నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి మంగళవారం భేటీ అయి కార్యక్రమ పురోగతిని సమీక్షించనున్నాయి. వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ కమిటీలన్నీ సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తాయి. త్వరలో ప్రారంభం కానున్న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3 లక్షల 70 వేల మంది హెల్త్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.

అయితే ఆదివారం గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్‌ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..