Tunnel affair: పొరుగింటి మహిళతో ఓ వ్యక్తి రాసలీలలు.. ఆమెను కలుసుకునేందుకు పెద్ద ఘనకార్యమే చేశాడు..!

ప్రియురాలిని రహస్యంగా కలుసుకునేందుకు.. తన ఇంట్లో నుంచి నేరుగా ఆమె బెడ్‌ రూంకి సొరంగాన్నే తవ్వాడు.

Tunnel affair: పొరుగింటి మహిళతో ఓ వ్యక్తి రాసలీలలు..  ఆమెను కలుసుకునేందుకు పెద్ద ఘనకార్యమే చేశాడు..!
Follow us

|

Updated on: Jan 10, 2021 | 11:26 PM

పొరుగింటి వివాహితతో సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను కలుసుకునేందుకు పెద్ద ఘనకార్యమే చేశాడు. ఆమెను రహస్యంగా కలుసుకునేందుకు భలే ప్లాన్‌ వేశాడు. తన ఇంట్లో నుంచి నేరుగా ప్రియురాలి బెడ్‌ రూంలోకి వెళ్లేలా ఏకంగా ఒక సొరంగాన్నే తవ్వాడు. అయితే, ఆ సొరంగం ఆమె భర్త కంటపడడంతో అసలు వ్యవహారం బయటపడింది.

మెక్సికోలోని టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి తన పొరుగింటి మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త జోర్గే లేని సమయంలో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతడు ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్ట్‌ సొరంగం ద్వారా ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లేలా ఫ్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం అల్బెర్ట్ వివాహిత రూమ్ వరకు ఓ సొరంగం మార్గం ద్వారా వెళ్లి కలుసుకుంటున్నాడు. ఇలా కొంతకాలంగా వారి మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నారు.

అయితే, ఒకరోజు జోర్గే.. ఆఫీస్‌ నుంచి ముందుగా ఇంటికి వచ్చేసరికి.. ఆ మహిళ, అల్బెర్ట్‌ల గదిలో కనిపించాడు. జోర్గేను చూడగానే భయంతో సోఫా వెనక నక్కిన అల్బెర్ట్‌.. అక్కడ ఉన్న సొరంగం గుండా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. అతడు సోఫా వెనుక దాక్కోవడాన్ని కళ్లారా చూసిన జోర్గే.. అక్కడికెళ్లి చూడగా.. మనిషి కనిపించలేదు. సోఫాను కొంచెం జరిపి చూడగా దాని కింద ఉన్న సొరంగ మార్గం బయటపడింది. అది చూసి జోర్గే షాక్ గురయ్యాడు. దాని గుండా వెళ్లగా అల్బెర్ట్‌ ఇంటి లోపలికి ఆ దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో.. విషయం కాస్తా పోలీసులకు దాకా వెళ్లింది. వివాహిత భర్త జోర్గే ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బర్టోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

వారానికి ఒకసారి పెళ్లి కూతురుగా ముస్తాబవుతోంది.. గత 16 సంవత్సరాలుగా ఇదే తంతు.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు.!

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..