AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాపిటల్ ఘటనతో మారిన అమెరికన్ల వైఖరి.. ట్రంప్‌పై దిగువసభలో అభిశంసన తీర్మానం.. శాశ్వతంగా పంపించేందుకు ఫ్లాన్..!

క్యాపిటల్‌ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ తల ఎత్తుకోలేని తరహాలో ఆయన్ను సాగనంపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.

క్యాపిటల్ ఘటనతో మారిన అమెరికన్ల వైఖరి..  ట్రంప్‌పై దిగువసభలో అభిశంసన తీర్మానం.. శాశ్వతంగా పంపించేందుకు ఫ్లాన్..!
Balaraju Goud
|

Updated on: Jan 11, 2021 | 4:52 AM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఫలితం వచ్చినప్పటికీ ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎదో ఒక సాకుతో మళ్లీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో అతన్ని ఆనవాళ్లు లేకుండానే సాగనంపేందుకు రాజకీయ విశ్లేషకులు ఫ్లాన్ చేస్తున్నారు. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈనెల 20 మధ్యాహ్నంతో ట్రంప్‌ పదవీకాలం ముగిసిపోతుంది. అదే రోజు కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ రెండ్రోజుల కిందట వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ మళ్లీ తల ఎత్తుకోలేని తరహాలో ఆయన్ను సాగనంపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా ట్రంప్‌ను శాశ్వతంగా పంపేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు కనిపిస్తుంది. ఇక, ఆయన తిరిగి అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు కూడా పనికిరాకుండా సాగనంపేందుకు ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుత అధ్యక్షుడి పదవీ కాలం చివరి రోజు అంటే జనవరి 20 వరకూ కూడా ట్రంప్‌ను ఉంచకుండా ముందుగానే పదవీచ్యుతుడిని చేసేందుకు యోచిస్తున్నారు. ఇందుకు ఉన్న అవకాశాలపై కుస్తీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ట్రంప్‌ మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. 2024లో పోటీ చేసే ఆలోచన ఉందని కూడా ఇటీవల ట్రంప్‌ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు ఆ అర్హత లేకుండా చేయాలని డెమొక్రాట్లు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు సైతం మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. మరోవైపు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే అంశాన్ని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించటం చాలా కష్టం. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, కేబినెట్‌ సభ్యులంతా అధ్యక్షుడు అసమర్థుడని ధ్రువీకరించాలి. దాన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. అభిశంసన కూడా చాలా సమయం పడుతుంది. ఇది జరగాలంటే… మొదట హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపుతారు. అక్కడ కూడా దీనిపై చర్చ జరుగుతుంది. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.గా, ఇప్పుడు పదవిలోంచి తీసేసేట్లుగా కాకుండా భవిష్యత్‌లో ట్రంప్‌ మళ్లీ పోటీచేయకుండా నిషేధం విధించేలా అభిశంసన తీర్మానం చేయాలని డెమోక్రాట్లు ఆలోచిస్తున్నారు. దీనికి జనవరి 20 దాటే అవకాశం ఉంటుంది.

ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం చేయాలని భావిస్తున్నారు. 2019లో ట్రంప్ ఓసారి అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కానీ, అది వీగిపోయింది. అయితే, అభిశంసన చేయడం కాస్త ప్రక్రియతో కూడుకున్న వ్యవహారమేంటున్నారు రాజ్యాంగ నిపుణులు.

అయితే, భవిష్యత్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ట్రంప్‌ను నిషేధించే తీర్మానాన్ని సెనేట్‌ ఆమోదించే అవకాశాలూ లేకపోలేదు. ఈ తీర్మానం నెగ్గటానికి సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఇది కాస్త సాధ్యమయ్యేదిగానే కనిపిస్తోంది. డెమొక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్‌లు కూడా ఈ తీర్మానానికి మద్దతిచ్చే అవకాశం ఉంటుంది.

Tunnel affair: పొరుగింటి మహిళతో ఓ వ్యక్తి రాసలీలలు.. ఆమెను కలుసుకునేందుకు పెద్ద ఘనకార్యమే చేశాడు..!