వారానికి ఒకసారి పెళ్లి కూతురుగా ముస్తాబవుతోంది.. గత 16 సంవత్సరాలుగా ఇదే తంతు.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు.!

Pakistan Woman Bride: పాకిస్థాన్‌లో నివిసిస్తున్న ఓ మహిళకు మాత్రం వింత అభిరుచి ఉంది. దాని గురించి తెలుసుకుని మొదట మీరు ఆశ్చర్యపోవచ్చు..

వారానికి ఒకసారి పెళ్లి కూతురుగా ముస్తాబవుతోంది.. గత 16 సంవత్సరాలుగా ఇదే తంతు.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2021 | 6:19 AM

Pakistan Woman Bride: ప్రపంచంలోని అందరికీ అభిరుచులు ఉంటాయి. కొందరికి ప్రయాణించడం అంటే ఇష్టం.. మరికొందరికి ఆహారం అంటే ఇష్టం.. ఇంకొందరికి చదవడం అంటే ఇష్టం.. ఇలా ఎవరి అభిరుచి వారిది. కానీ పాకిస్థాన్‌లో నివిసిస్తున్న ఓ మహిళకు మాత్రం వింత అభిరుచి ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత 16 సంవత్సరాలుగా ప్రతీ శుక్రవారం వధువుగా అలంకరించుకుంటూ ఉంది. అసలు ఆమె అలా ఎందుకు చేస్తోంది.? దాని వెనుక ఉన్న కారణం ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ మహిళ పేరు హీరా జీషన్, లాహోర్‌లోని పంజాబ్ నగరంలో నివసిస్తున్న ఈమెకు 42 సంవత్సరాలు. గత 16 సంవత్సరాలుగా, ప్రతీ శుక్రవారం వధువులా అలంకరించుకుంటుంది. ఇక ఈ విషయం చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అసలు తాను ఎందుకు అలా చేస్తున్నానో హీరా తాజా వెల్లడించింది.

16 సంవత్సరాల క్రితం తన తల్లి బ్లడ్ క్యాన్సర్ బారిన పడిందని హీరా చెప్పింది. ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో లాహోర్‌లోని గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక చనిపోయే ముందు తన కుమార్తె వివాహం చేసుకోవాలని ఆ తల్లి తన కోరికను వ్యక్తం చేసింది. కాబట్టి, ఆసుపత్రిలోనే, హీరా తల్లి కోరిక మేరకు ఆమెకు రక్తదానం చేసిన వ్యక్తినే వివాహమాడింది. తన తల్లికి హీరా ఆసుపత్రి నుంచే రిక్షాలో వీడ్కోలు పలికింది.

ఇదిలా ఉంటే హీరాకు ఆరుగురు సంతానం. అందులో ఇద్దరు పుట్టినప్పుడే మరణించారు. ఒకవైపు తల్లి.. మరోవైపు పిల్లలు ఆకస్మికంగా మరణించడంతో హీరా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తన భర్త(జీషన్) విదేశాల్లో స్థిరపడటంతో ఒంటరితనంతో ఫీల్ అయింది. ఇక ఈ రెండింటితో పోరాడేందుకు ఆమె ప్రతీ వారం వధువుగా అలంకరించుకుని నూతన పెళ్లికూతురుగా రెడీ అవుతుంది. ఇలా గత 16 ఏళ్లుగా ఇదే తరహాలో ముస్తాబవుతూ తనకు తానులో ఆనందాన్ని వెతుకుంటోంది. ఇదంతా తన భర్త కోసం చేస్తున్నానని.. ప్రతీ మహిళ కూడా తనవారి కోసం ఇలా ఒక రోజు కేటాయించాలని ఆమె సలహా ఇచ్చింది.