ప్రధాని మోదీని మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్..
WHO Chief Praises Narendra Modi: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. కరోనాపై పోరాటంలో ప్రపంచదేశాలన్నీ కూడా భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. భారత్‌లో కరోనా రికవరీ రేటు బాగుందని.. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపింది. భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు కరోనా నియంత్రణ చర్యల్లో చేస్తోన్న సాయాన్ని కూడా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ ప్రశంసించారు. వ్యాక్సిన్ తయారీలో కూడా భారత్ కీలక […]
WHO Chief Praises Narendra Modi: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. కరోనాపై పోరాటంలో ప్రపంచదేశాలన్నీ కూడా భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. భారత్‌లో కరోనా రికవరీ రేటు బాగుందని.. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపింది.
భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు కరోనా నియంత్రణ చర్యల్లో చేస్తోన్న సాయాన్ని కూడా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ ప్రశంసించారు. వ్యాక్సిన్ తయారీలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ కొనియాడారు. భారత్‌లో 500 కేసులు ఉన్నప్పుడే మోదీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుందని.. అందుకే అక్కడ వైరస్ అదుపులో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అన్నారు.
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..