‘మహా’ రాజకీయం! సంజయ్, ఫడ్నవీస్ భేటీ, ఉధ్ధవ్, పవార్ సమాలోచన !

శివసేన నేత సంజయ్ రౌత్, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భేటీ కావడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఓ సంచలనమే అయింది. వీళ్ళిలా భేటీ అయిన కొన్ని గంటలకే  ఎన్సీపీ సీనియర్ నాయకుడు..

'మహా' రాజకీయం! సంజయ్, ఫడ్నవీస్ భేటీ, ఉధ్ధవ్, పవార్ సమాలోచన !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 7:56 PM

శివసేన నేత సంజయ్ రౌత్, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భేటీ కావడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఓ సంచలనమే అయింది. వీళ్ళిలా భేటీ అయిన కొన్ని గంటలకే  ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ హుటాహుటిన వెళ్లి సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రేని కలిశారు. వీరు ఏం చర్చించారో తెలియదు గానీ, ‘సరికొత్త పరిణామం’ గురించే అన్నది బహిరంగ రహస్యం. అయితే దేవేంద్ర ఫడ్నవీస్, తను సమావేశం కావడంలో రాజకీయమేమీ లేదని, తమ ‘సామ్నా’ పత్రికకు ఇంటర్వ్యూ కోసమే తను ఆయనతో భేటీ అయ్యానని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తనకు ఫడ్నవీస్ శత్రువు కాదన్నారు. మా భేటీ గురించి ఉధ్ధవ్ థాక్రేకి ముందే తెలుసు అని చెప్పారు. బీజేపీతో శివసేన మళ్ళీ అంటకాగడం కాంగ్రెస్ పార్టీకి అసలు ఇష్టం లేదు. మరి..రానున్న రోజుల్లో ఏం తేలనుందో ?