పల్లీలు ఎక్కువగా తింటున్నారా..? ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!

పల్లీలు తరచూ తింటూ ఉంటే ఎముకలను లోపలి నుండి బలోపేతం చేస్తుంది. అలాగే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే, వేరుశెనగ తినేటప్పుడు, దాని పరిమాణం గురించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో తప్పక తెలుసుకోవాలి..

పల్లీలు ఎక్కువగా తింటున్నారా..? ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!
Peanuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 01, 2025 | 6:00 PM

విటమిన్-ఇ, కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్-బి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు వేరుశెనగలో పుష్కలంగా లభిస్తాయి. వేరుశెనగలు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. పైగా ఇది మంచి ఆరోగ్యం కూడా. పల్లీలు తరచూ తింటూ ఉంటే ఎముకలను లోపలి నుండి బలోపేతం చేస్తుంది. అలాగే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే, వేరుశెనగ తినేటప్పుడు, దాని పరిమాణం గురించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో తప్పక తెలుసుకోవాలి..

వేరుశెనగలు అతిగా తింటే, జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే పల్లీల్లో ఫైబర్ ఉంటుంది. వేరుశెనగలో కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంతమంది వ్యక్తుల్లో ఇవి జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. తద్వారా గ్యాస్, కడుపు ఉబ్బరం కలుగుతుంది. అందుకే మితంగా తినడం ఉత్తమం. వేరుశెనగలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యను పెంచుతుంది. కనుకు పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగను ఎక్కువగా తినడం వల్ల చర్మ అలెర్జీ సమస్యలు వస్తాయి. శరీరంపై వాపు, ఎరుపు, దురద, దద్దుర్లు కూడా రావొచ్చు అంటున్నారు.

వేరుశెనగను ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని చాలా అధ్యయనాల్లో తేలింది. వేరుశెనగలో అధిక స్థాయిలో కొవ్వు, ఫైబర్ ఉంటుంది. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే.. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా అతిసారం సమస్య తలెత్తవచ్చు. అందుకే.. జీర్ణ వ్యవస్థ సరిగా ఉండాలంటే వేరుశెనగలను మితంగా తినాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలను నివారించడానికి, ఒక రోజులో 100 గ్రాముల కంటే ఎక్కువ వేరుశెనగ తినకూడదు. మీరు వాటిని అల్పాహారంతో కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..