న్యూ ఇయర్ ఆరంభంలోనే తప్పిన ముప్పు..! గ్యాస్ ఫిల్లింగ్‌ప్లాంట్ నుంచి లీకైన CO2.. ఏం జరిగిందంటే..
ట్యాంకర్‌లో గ్యాస్ నింపిన తర్వాత వాల్వ్ సరిగ్గా అమర్చలేదు. దీంతో గ్యాస్ ఒత్తిడికి వాల్వ్ తెగిపోయి ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. తెల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సమీపంలోని వాహనాలు, చెట్లపై మంచు పొరలా కమ్మేసింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. గడ్డకట్టుకుపోతున్న వాతావరణంతో చుట్టుపక్కల ప్రజల్లో తీవ్ర భయాందోళన సైతం నెలకొంది.
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ దేశంలో ఓ ఘోర ప్రమాదం తప్పింది. దేశమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలుతుండగా, రాజస్థాన్‌లో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. జైపూర్‌లోని విశ్వకర్మ ప్రాంతం రోడ్ నంబర్ 18లో ఉన్న గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ నుంచి అకస్మాత్తుగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) లీకైంది. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇదంతా చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే విశ్వకర్మ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్‌లోకి వెళ్లి లీకేజీ అవుతున్న వాల్వ్‌ను మూసివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విశ్వకర్మ ఏరియాలోని రోడ్ నంబర్ 18లో ఉన్న అజ్మీరా గ్యాస్ ప్లాంట్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ పెను ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్లాంట్‌లో CO2 గ్యాస్‌ను నిల్వ చేయడానికి రెండు పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి. ట్యాంకర్‌లో గ్యాస్ నింపిన తర్వాత వాల్వ్ సరిగ్గా అమర్చలేదు. దీంతో గ్యాస్ ఒత్తిడికి వాల్వ్ తెగిపోయి ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. తెల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సమీపంలోని వాహనాలు, చెట్లపై మంచు పొరలా పొగ కమ్మేసింది. దీంతో చుట్టుపక్కల ప్రజల్లో భయాందోళన నెలకొంది.
#WATCH | Jaipur, Rajasthan | Today at 4:08 pm, information was received that due to the breakage of the valve of the tank of Ajmera Oxygen Plant in VKI Road, carbon dioxide was leaking. The rescue team reached the spot and saw that nothing was visible for 200 meters. As per the… pic.twitter.com/o0zmrQgWdL
— ANI (@ANI) December 31, 2024
గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చలి కారణంగా లీకేజీ కారణంగా విడుదలైన CO2 సమీపంలో పార్క్ చేసిన వాహనాలు, చెట్లపై మంచులా గడ్డకట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. స్టేషన్ ఇన్‌చార్జి రాజేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీ కారణంగా సమీపంలో పార్క్ చేసిన వాహనాలపై మంచు పరుచుకుంది. అంతేకాకుండా చెట్లపై మంచు కూడా పేరుకుపోయిందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..