AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Round-Up 2024: కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభవాలు.. గుర్తుంచుకోవాల్సిన విజయాలు, మరిచిపోలేని ఓటములు

మనిషి జీవితం షడ్రుచుల సమ్మేళనం అయినప్పుడు.. ఈ ఏడాది సంఘటనలు కూడా అలాగే ఉంటాయిగా. కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభవాలు.. గుర్తుంచుకోవాల్సిన విజయాలు, మరిచిపోలేని ఓటములు.. ప్రముఖుల అరెస్టులు, ఆటగాళ్ల రిటైర్మెంట్లు.. ఆధ్యాత్మిక సంబరాలు, అద్భుత విజయాలు.. దేశాన్ని కుదిపేసిన దారుణాలు, సమాజాన్ని ప్రభావితం చేసినవారి మరణాలు.. ఇలా అన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుందాం...

India Round-Up 2024: కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభవాలు.. గుర్తుంచుకోవాల్సిన విజయాలు, మరిచిపోలేని ఓటములు
India @2024
Shaik Madar Saheb
|

Updated on: Dec 31, 2024 | 9:18 PM

Share

మనిషి జీవితం షడ్రుచుల సమ్మేళనం అయినప్పుడు.. ఈ ఏడాది సంఘటనలు కూడా అలాగే ఉంటాయిగా. కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభవాలు.. గుర్తుంచుకోవాల్సిన విజయాలు, మరిచిపోలేని ఓటములు.. ప్రముఖుల అరెస్టులు, ఆటగాళ్ల రిటైర్మెంట్లు.. ఆధ్యాత్మిక సంబరాలు, అద్భుత విజయాలు.. దేశాన్ని కుదిపేసిన దారుణాలు, సమాజాన్ని ప్రభావితం చేసినవారి మరణాలు.. ఇలా అన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుందాం.. హిందువుల శతాబ్దాల కల నెరవేరిన ఏడాది ఇది. అయోధ్యానగరిలో భవ్య రామమందిరం రూపుదిద్దుకున్న అపురూపమైన ఏడాది ఇది. 2024కు ఒక గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది బాలరాముని దర్శనం. జనవరి 22న రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. అతిరథ మహారథుల సమక్షంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండుగలా జరిగింది ఆనాడు. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ఆ ప్రారంభోత్సవ వేడుకను.. వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు. 500 ఏళ్లుగా రామ మందిరం కోసం పోరాడుతున్న హిందువులకు మరపురాని జ్ఞాపకాలను అందించింది 2024.. ఇక ఈ ఏడాది అత్యంత ఉత్కంఠగా సాగింది మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికలే. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, లేదా కాంగ్రెస్‌ కూటమికి అధికారం దక్కుతుందా? పోటాపోటీగా సాగిన ఎన్నికల రణరంగంలో రికార్డ్‌ విజయాన్ని అందుకుంది బీజేపీ. 400 సీట్లే టార్గెట్‌గా బరిలో దిగినప్పటికీ.. 240 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అయినా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి