Video: కాన్‌స్టాస్, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్.. మీమ్స్‌తో రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్
Siraj Dismissed Konstas, Head: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. మరో 84 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఈ క్రమంలో సిరాజ్ మియా ఓకే ఓవర్లో డేంజరస్ ప్లేయర్లను పెవలియన్ చేర్చి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Siraj Dismissed Konstas, Head: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదవ, చివరి టెస్ట్‌లో తొలి రోజు నుంచే హై డ్రామా మొదలైంది. ఈ క్రమంలో 2వ రోజు మహ్మద్ సిరాజ్ వేసిన 12వ ఓవర్ చర్చనీయాంశంగా మారింది. ఈ హైదరాబాదీ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మద్దతునిచ్చే క్రమంలో భారత జట్టుకు తలనొప్పిగా మారే ఇద్దరు బ్యాటర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో మైదానంలో కాదు, సోషల్ మీడియాలోనూ సిరాజ్ ట్రెండ్ అవుతున్నాడు. సిరాజ్ తన ఓవర్లో శామ్ కాన్స్టాస్ (23), ట్రావిస్ హెడ్(4)లను అవుట్ చేశాడు.
భారత బౌలర్లపై దూకుడుగా ఆడే స్వభావం ఉన్న కాన్స్టాస్‌ను మంచి లెంగ్త్‌లో సిరాజ్ చేసిన షార్ప్ డెలివరీకి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌ను కూడా అదే పద్ధతిలో సిరాజ్ ఔట్ చేశాడు.
2వ రోజు ప్రారంభంలోనే సిరాజ్ ఈ ఇద్దరు ఆటగాళ్లను పెవిలియన్ చేర్చడంతో అభిమానులు ట్రావిస్ హెడ్, సామ్ కాన్స్టాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే, తొలిరోజు ఆటలో శామ్ కాన్‌స్టాస్ అనవసరంగా బుమ్రాను కెలికాడు. ఆ వెంటనే బుమ్రా ఖవాజాను పెవిలియన్ చేర్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో సిరాజ్ ఆసీస్ యంగ్ ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్‌ను పెవిలియన్ చేర్చి బుమ్రా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ట్వీట్స్ ఓసారి చూద్దాం..
X లో నెటిజన్లు పోస్ట్ చేసిన కొన్ని మీమ్‌లను చూద్దాం..
DSP SIRAJ ON FIRE…
After getting Two Wickets in One Over, First Sam Konstas and Than Travis Head..
Siraj Fan says : Siraj is Fire now…
Siraj says : I am not a fire, I am Wild fire 🔥
Now DSP Siraj Power Start.!! Salute 🫡 DSP SIRAJ #INDvsAUS pic.twitter.com/7SyhP51ryi
— sinh Jayshree ( हिन्दू) (@SinhJayshr29800) January 4, 2025
DSP Siraj rocked 🚨 KONSTAS and Travis head shocked….
No knocked always rocked #INDvsAUS #INDvsAUSTest pic.twitter.com/kceKq9R1Zg
— Vicky Gurjar (@VeekeshGujjar) January 4, 2025
DSP Siraj is back in action! 🚨💪
This time, he arrests Travis Head right on the field! 🏏⚡ pic.twitter.com/cJOSdouEkg
— Sonu Yaduvanshi (@sonuydv8174) January 4, 2025
మొదటి రోజు 185 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత జట్టు.. రెండో అద్భుతంగా తిరిగి గేమ్‌లోకి వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. మరో 84 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..