మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. వైసీపీకి నేను మద్దతిస్తా..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా.. మహిళలపై జరుగుతోన్న హత్యాచారాలపై ఏపీ అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషమన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. 3, 6 ఏళ్ల బాలికలపై కూడా అత్యాచారం చేస్తోన్న.. కామాంధులను.. రాక్షసులను ఏమనాలో కూడా.. అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మధ్య కాలంలో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా […]

మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. వైసీపీకి నేను మద్దతిస్తా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2019 | 2:54 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా.. మహిళలపై జరుగుతోన్న హత్యాచారాలపై ఏపీ అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషమన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. 3, 6 ఏళ్ల బాలికలపై కూడా అత్యాచారం చేస్తోన్న.. కామాంధులను.. రాక్షసులను ఏమనాలో కూడా.. అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ మధ్య కాలంలో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఇలాంటి నిందితులకు కఠిన శిక్షలు పడాలన్నారు. దిశ ఘటన చాలా బాధకరం.. నలుగురు నిందితులు రాక్షసంగా ప్రవర్తించారని.. వారికి తగిన శిక్ష పడిందన్నారు చంద్రబాబు.

కాగా.. మహిళలపై చేయి వేస్తే.. అదే వాడికి చివరి రోజు కావాలని.. అలాంటి మంచి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. నిందితులకు ఎంత గొప్ప వారైనా.. శిక్ష పడేలా అమలు పరచాలన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించి.. మరింత పటిష్ఠవంతమైన చట్టాలను తీసుకురావాలని.. మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా సమర్థించడానికి సిద్ధమని తెలిపారు చంద్రబాబు.