లోకేశ్‌ తినే పప్పులో ఉల్లిపాయ లేదనే చంద్రబాబు బాధ..

దిశ ఘటన నేపథ్యంలో  ఏపీ అసెంబ్లీలో మహిళా భద్రతపై చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉల్లి కొరతపై చర్చించాలంటూ టీడీపీ పట్టు బట్టింది. దీంతో టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తమ వాణిని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా..మహిళల రక్షణ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆమె..నిందితులకు కఠిన శిక్ష పడితే.. మరోసారి తప్పు చేయడానికి సిద్ధపడరని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా కూడా […]

లోకేశ్‌ తినే పప్పులో ఉల్లిపాయ లేదనే చంద్రబాబు బాధ..
Follow us

|

Updated on: Dec 09, 2019 | 2:22 PM

దిశ ఘటన నేపథ్యంలో  ఏపీ అసెంబ్లీలో మహిళా భద్రతపై చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉల్లి కొరతపై చర్చించాలంటూ టీడీపీ పట్టు బట్టింది. దీంతో టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తమ వాణిని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా..మహిళల రక్షణ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆమె..నిందితులకు కఠిన శిక్ష పడితే.. మరోసారి తప్పు చేయడానికి సిద్ధపడరని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా కూడా మహిళకు రక్షణ లేకుండా పోయిందని..అందుకే మృగాళ్లను ఎన్‌కౌంటర్ చేయడాన్ని మహిళలంతా సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు.  రాష్ట్రపతి కూడా.. రేపిస్టులకి క్షమాభిక్ష ఎందుకని ప్రశ్నించారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.  సభద్వారా..తాను సీఎంని కోరేది ఒక్కటే అన్న రోజా, ఆడపిల్లలపై దాడి చేస్తే.. వారికి వెన్నులో వణుకు పుట్టేలాగా.. చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నామని తెలిపారు.

రోజా మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో ఆమె అసహనానికి గురయ్యారు. రాష్ట్రంలో ఆడపిల్లల మాన,  ప్రాణాల భద్రత  విషయం పట్టించుకోకుండా,  లోకేశ్‌ తినే పప్పులో ఉల్లిపాయ లేదని చంద్రబాబు బాధ పడుతున్నారని ఆరోపించారు. ఆడపిల్ల ఉంటే ఆ బాధ ఏంటో తెలుస్తుందన్న రోజా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటోన్న వ్యక్తి మహిళలపై చూపించే నిబద్దత ఇదేనా అని ప్రశ్నించారు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే.. అత్త వద్దంటుందా అని, ఆడబిడ్డల పుట్టుకనే వ్యతిరేకించే  వ్యక్తి చంద్రబాబని ఆమె ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడి జరిగితే  గన్ కంటే ముందు జగన్ వస్తారనే నమ్మకంతో మహిళలు  ఉన్నారని రోజా పేర్కొన్నారు.