నీళ్లు కావాలంటే టోకెన్ తీసుకోవాల్సిందే..!
చెన్నైలో రోజురోజుకు నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఓ పక్క నీటి ఎద్దడి మరోపక్క ఎంకెన్నాళ్లీ కష్టాలు అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోయపట్టా ప్రాంతంలో టోకెన్లు కేటాయించి ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ముందుగానే టోకెన్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం నీటి సంక్షోభం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. నీటి ఎద్దడి నియంత్రించడంలో విఫలమయ్యారంటూ.. పురపాలక మంత్రి ఎస్‌పీ వేలుమణి రాజీనామా […]
చెన్నైలో రోజురోజుకు నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత ఓ పక్క నీటి ఎద్దడి మరోపక్క ఎంకెన్నాళ్లీ కష్టాలు అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోయపట్టా ప్రాంతంలో టోకెన్లు కేటాయించి ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ముందుగానే టోకెన్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం నీటి సంక్షోభం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. నీటి ఎద్దడి నియంత్రించడంలో విఫలమయ్యారంటూ.. పురపాలక మంత్రి ఎస్‌పీ వేలుమణి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేలుమణికి వ్యతిరేకంగా 400 మంది డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. ఖాళీ కుండలను చేతపట్టుకుని నీళ్లు కావాలంటూ దాదాపు 100 మంది మహిళలు నిరసనకు దిగారు. అలాగే తాగునీటిని రోజువారి సరఫరా చేయాలని ఆందోళన చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.