పోలీసులను ప్రశంసించిన కేటీఆర్..

సైబరాబాద్ పోలీసులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశంశలు కురిపించారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 581 మంది చిన్నారులను రక్షించి, వారికి నివాసం కల్పించడం మామూలు విషయం కాదని అన్నారు. రాష్ట్ర పోలీసులు శభాష్‌ అని మరోసారి నిరూపించారని ట్విటర్‌లో పేర్కొంటూ హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ, సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ సీపీలకు అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు బృందాలు తమ విధులను గొప్పగా నిర్వర్తిస్తున్నారు. కమిషనరేట్ […]

పోలీసులను ప్రశంసించిన కేటీఆర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 8:52 AM

సైబరాబాద్ పోలీసులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశంశలు కురిపించారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 581 మంది చిన్నారులను రక్షించి, వారికి నివాసం కల్పించడం మామూలు విషయం కాదని అన్నారు. రాష్ట్ర పోలీసులు శభాష్‌ అని మరోసారి నిరూపించారని ట్విటర్‌లో పేర్కొంటూ హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ, సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ సీపీలకు అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు బృందాలు తమ విధులను గొప్పగా నిర్వర్తిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోగల కార్ఖానాలు, పరిశ్రమలు, కంపెనీలు, టూరిస్టు ప్రాంతాలు, ఆశ్రమాలను జల్లెడ పడుతున్నారు. రోడ్లపై బిచ్చగాళ్లుగా బతుకీడుస్తున్న చిన్నారులు, అడుక్కుంటూ ఫుట్‌పాత్ లపై ఉంటున్న వారిని, చెత్త డంపింగ్ యార్డులో కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్నారులను రక్షించి వారికి మంచి భవిష్యత్‌ను కల్పిస్తున్నారు.