బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చేయిచేసుకున్న పోలీసులు
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. జుమ్మెరాత్ బజార్‌లో స్థానికులంతా కలిసి రాణి అవంతిభాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించారు. అయితే విగ్రహ ఏర్పాటును స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో రాజాసింగ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు.