రాజగోపాల్ పై టీపీసీసీ కొరడా..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం. కోదండరెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలపై ఈ నెల 15వ […]

రాజగోపాల్ పై టీపీసీసీ కొరడా..!
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 7:20 AM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం. కోదండరెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలపై ఈ నెల 15వ తేదీన నల్గొండలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడే ప్రత్యామ్నాయం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమేనని వ్యాఖ్యానించిన విషయాన్ని నోటీసులు పేర్కొన్నారు.