‘హలో విజయ్ గారూ’ అంటూ మోదీ షేక్ హ్యాండ్!
జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. లాబీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రధాని మోదీ ‘ విజయ్ గారూ.. హలో’ అంటూ పలకరించి..షేక్ హ్యండ్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ […]
జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. లాబీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రధాని మోదీ ‘ విజయ్ గారూ.. హలో’ అంటూ పలకరించి..షేక్ హ్యండ్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి ‘హాయ్ విజయ్ గారు’ అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. pic.twitter.com/7zfxU6xewK
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2019