Pakistan: పోలీసులను చూసి పాక్ మాజీ మంత్రి పరుగో పరుగు.. కోర్టులోకి పట్టుకెళ్లిన లాయర్లు.. వైరల్ అవుతున్న వీడియో..

Pakistan: ఇస్లామాబాద్ హైకోర్టు బయట నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఫవాద్ చౌదరి కోర్టు ఆవరణలో పరుగులు తీశాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన..

Pakistan: పోలీసులను చూసి పాక్ మాజీ మంత్రి పరుగో పరుగు.. కోర్టులోకి పట్టుకెళ్లిన లాయర్లు.. వైరల్ అవుతున్న వీడియో..
Pak Ex Minister Fawad Chaudhry
Follow us

|

Updated on: May 17, 2023 | 5:34 AM

Pakistan: ఇస్లామాబాద్ హైకోర్టు బయట నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఫవాద్ చౌదరి కోర్టు ఆవరణలో పరుగులు తీశాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు వద్ద మంగళవారం నాటకీయ సదృశ్యం చోటు చేసుకుంది. తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఫవాద్ కోర్టులోకి ఒక్క సారిగా పరుగు పెట్టాడు.

ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను శాంతపరిచేందుకు పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఫవాద్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే తన అరెస్ట్‌పై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, పోలీసులు అతన్ని కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చి, తన కారు ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో పోలీసులు ఆయన కారును అడ్డుకొని, మరో కేసులో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన తన కారు దిగి, వేగంగా కోర్టు లోపలకు పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

తనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన మాటలపై స్పందించిన జడ్జి మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆయన పరుగెత్తుతున్న సమయంలో కోర్టు ప్రాంగణంలో కిందపడిపోగా, లాయర్లు వచ్చి, ఆయనను లోపలకు తీసుకెళ్లారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.