AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు

విశాఖ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో ఆన్‌ చేసిన కాసేపటికే ఏసీలోంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పొగలు, కాసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి మొత్తం పూర్తి కాలిబూడిదయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Andhra News: ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
Visakhapatnam House Fire
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 8:13 AM

Share

విశాఖ తగరపువలస ప్రాంతం.. శ్రీ రెసిడెన్సి.. బహుళ అంతస్తుల సముదాయంలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరూ.. చీకటి పడ్డాక ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు.. ఇంతలో ఒకటే అలజడి.. అరుపులు కేకలు..! తలుపులు తెరిచి చూస్తే పరుగులు. ఏమైందా అని ఆరా తీస్తే.. గుండెలు పట్టుకునే దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని తగరపువలసలకు చెందిన ఓ కుటుంబం శ్రీ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు. అయితే కాస్త ఉక్కపోతగా ఉందని వారు ఏసీ ఆన్ చేశారు.

అంతే ఒక్కసారిగా ఏదో వాసన వస్తున్నట్టు అనిపించింది. అలేంటీ వాసన అని తేరుకునేలోపే ఇంటి నిండా పొగ దట్టంగా అలముకుంది. ఇంతలోనే భారీగా మంటలు. ఆ మంటలను చూసిన కుటుంబ సభ్యులు అరుపులు కేకలు. ఆ ఫ్లాట్‌లోంచి పొగలు రావడంతో మిగతా ప్లాట్లో ఉన్న జనాలు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు.

వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందు రంగంలోకి దిగారు. కాసేపట్లోనే మంటలను మొత్తం అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏసీ పేలి మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు మొత్తం కాలి బూడిదైపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఉపరిపిల్చుకున్నారు.ఇక ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అయింటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us