Vizag Industrial corridor: అందరి ఓటు వైజాగ్‌కే.. ఇండస్ట్రియల్ కారిడార్
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగ్‌ని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్... విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా డెవలప్ చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ వైజాగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
Jagan government to develop Vizag as industrial corridor: ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్‌ని రాజధానిగానే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్. విశాఖలో వున్న చక్కటి వనరులను వినియోగించుకోవడం ద్వారా ఏపీని పారిశ్రామికంగా సంపూర్ణ స్థాయిలో అభివృద్ది పరచాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని మంత్రులిద్దరు ప్రకటించారు. విశాఖలో మంగళవారం జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ సదస్సుల్లో ఇద్దరు మంత్రులు పాల్గొని, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల సమాన అభివృద్ధిని సీఎం జగన్ కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధి కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహకాలు అందించే వాతావరణం విశాఖలో వుందన్నారాయన. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి కేవలం 48 గంటలలో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు.
పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా నైపుణ్య, శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారాయన. వై.ఎస్.ఆర్ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు గౌతమ్ రెడ్డి.
Also read: Ten times more funds to South Central Railway, says Piyush Goel
2024 సంవత్సరానికి పారిశ్రామిక అభివృద్ధి సూచీలో ఏపీ ముందు ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో వ్యవసాయ రంగ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. విశాఖ త్వరలో ప్రపంచ స్థాయి మహా నగరంగా అవతరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.