Piyush Goel on SCR: గతం కంటే పదింతలు ఎక్కువ నిధులు

తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బీజేపీ మండిపడుతోంది. ఏకంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. తెలంగాణకు కేంద్రం కేటాయిస్తున్న నిధుల వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్ వచ్చారు.

Piyush Goel on SCR: గతం కంటే పదింతలు ఎక్కువ నిధులు
Follow us

|

Updated on: Feb 18, 2020 | 2:33 PM

Peeyush Goel says Modi government allocating 10 times more funds to Telangana state: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేకు గతం కంటే పదింతల ఎక్కువ నిధులు కేటాయిస్తోందని ప్రకటించారు. కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు పీయూష్ గోయెల్. తెలంగాణ అభివ‌ృద్ది కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్.

హైదరాబాద్ పర్యటనలో వున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం నాడు దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టులను సమీక్షించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ ఎంపీలు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయెల్.. తెలంగాణ చరిత్రలో గోల్డెన్ ఎరా కొనసాగుతోందని అన్నారు. ప్రధాని మోడీ అందరి కోసం పని చేస్తాను అని మాట ఇచ్చారు…దానికి కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారాయన.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దక్షిణ మధ్య రైల్వేను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంటున్నారు కానీ అది కాంగ్రెస్ హయంలో జరిగేది.. ఇప్పుడు మోదీకి దేశం అంతా ఒక్కటే.. కేంద్రం ఇచ్చిన నిధులను తలసాని మరిచిపోయినట్టు వున్నారని పీయూష్ గోయెల్ ఎద్దేవా చేశారు. 258 కోట్లు గతంలో ఇచ్చారు కానీ ఇప్పటి బడ్జెట్లో 10 ఇంతలు ఎక్కువ నిధులు తెలంగాణకు ఇచ్చామని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. తమ దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని, కేంద్రం దేని కింద ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్కలు తీసుకునే హైదరాబాద్ వచ్చానన్నారు.

యూపీఏ హయాంలో తెలంగాణకు 2014-15లో రూ.258 కోట్లు కేటాయిస్తే… ఎన్డీయే హయాంలో 2020-21లో 2,602 కోట్లు ఇచ్చామని, అది గతం కంటే పదింతలు ఎక్కువ అంటూ లెక్కలు చెప్పారు పీయూష్ గోయెల్. ఎంఎంటీఎస్ కోసం 500 కోట్లు ఖర్చు కేంద్ర ఇచ్చింది.. కానీ రాష్టం ఇవ్వాల్సిన నిదులను విడుదల చేయలేదని అందుకే పనులు ఆగిపోయాయని చెప్పారాయన. కేంద్రం డబ్బులు ఇవ్వని కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా ఆగిపోలేదని.. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్దమంటూ సవాల్ చేశారు పీయూష్ గోయెల్.

Also read: Vizag to be an Executive capital of Andhra as well as Industrial corridor

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే