Viral Video: ఈఫిల్ టవర్ ముందు భారతీయ సంప్రదాయంలో ‘ధోలిడా’ పాటకు డ్యాన్స్.. వీడియో వైరల్
Gangubai Kathiawadi Song: గత కొంతకాలంగా తమకు ఇష్టమైన సాంగ్స్ వినిపిస్తే చాలు.. రీల్స్ చేస్తూ వాటితో సోషల్ మీడియా (Social Meida)లో సందడి చేస్తున్నారు. పాట ఏ భాషకు చెందింది.. ఏ దేశానికి చెందింది అనే మాటలేదు..
Gangubai Kathiawadi Song: గత కొంతకాలంగా తమకు ఇష్టమైన సాంగ్స్ వినిపిస్తే చాలు.. రీల్స్ చేస్తూ వాటితో సోషల్ మీడియా (Social Meida)లో సందడి చేస్తున్నారు. పాట ఏ భాషకు చెందింది.. ఏ దేశానికి చెందింది అనే మాటలేదు.. తమను అలరిస్తే చాలు..దేశవిదేశాల్లో అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప మూవీ(Pushpa Movie) లోని సాంగ్స్, కచ్చా బాదామీ(Kacha Badami song) వంటి సాంగ్స్ తో పాటు తాజాగా అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి మూవీలోని ధోలిడా సాంగ్ కు రీల్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సాంగ్ రీల్ కోసం ప్రపంచలోని అతిసుందర ప్రదేశము పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వేదికగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
గంగూబాయి కతియావాడి సినిమాలోని ‘ధోలిడా’ పాట ఎంత హిట్టయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటపై బాలీవుడ్ నటి అలియాభట్ అద్భుతంగా డాన్స్ చేశారు. ఇప్పుడు అనేకమంది ఈ పాటపైనే ఇన్‌స్టా రీల్ చేస్తున్నారు. కాగా, ఓ ఇన్‌స్టాగ్రాం యూజర్ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎదుట ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసారు. మాన్సీ పరేఖ్ అనే ఇన్‌స్టా యూజర్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో ఈఫిల్ టవర్ ఎదుట ధోలిడా పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాం పోస్ట్ చేయడంతో వేలమంది వీక్షిస్తున్నారు. ఫరేఖ్ మిత్ర బృందం చేసిన డాన్స్‌కు ఫిదా అవుతున్నారు. హుక్‌స్టెప్‌ను అద్భుతంగా వేశారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
View this post on Instagram
Also Read:
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సర్జరీ.. ఇంతకు ఏమైందంటే..