Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సర్జరీ.. ఇంతకు ఏమైందంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డార్లింగ్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రాధేశ్యామ్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్.

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సర్జరీ.. ఇంతకు ఏమైందంటే..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2022 | 6:27 PM

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డార్లింగ్ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రాధేశ్యామ్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన ఓ టాపిక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ ప్రమాదానికి గురయ్యారని టాక్ వినిపిస్తుంది. రాధేశ్యామ్ సినిమా పూర్తికావడంతో ఇప్పుడు సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కు గాయాలయ్యాయని తెలుస్తుంది.

కొన్ని నెలల క్రితం ‘సలార్’ సినిమా షూటింగ్​లో ప్రభాస్ గాయపడ్టట్లు తెలుస్తుంది. అయితే చిన్న ఆపరేషన్ అవసరం కూడా ఉందట.. ప్రభాస్ స్పెయిన్​లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. చిన్నపాటి ఆపరేషన్​ అయినప్పుటికీ డాక్టర్లు ప్రభాస్​ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్నడార్లింగ్ ఫాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సలార్ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్​-కే , సందీప్ వంగ డైరెక్షన్ లో  స్పిరిట్‌ చిత్రాలు చేస్తున్నాడు. వీటితోపాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..