AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cherry-Tarak: ప్రపంచానికి తెలియని స్నేహం మాది.. మేము భిన్న ధ్రువాలం.. అందుకే చెర్రీ అంటే ఇష్టం అంటున్న తారక్

Cherry-Tarak Friendship: అభిమానులు మాత్రమే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ కొట్టుకుంటారు.. కానీ హీరోలు మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు కలిసి మెలసి ఉంటారు. ముఖ్యంగా యంగ్ హీరోల మధ్య మంచి..

Cherry-Tarak: ప్రపంచానికి తెలియని స్నేహం మాది.. మేము భిన్న ధ్రువాలం.. అందుకే చెర్రీ అంటే ఇష్టం అంటున్న తారక్
Ntr Ram Charan Friendship
Surya Kala
|

Updated on: Mar 18, 2022 | 6:57 PM

Share

Cherry-Tarak Friendship: అభిమానులు మాత్రమే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ కొట్టుకుంటారు.. కానీ హీరోలు మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు కలిసి మెలసి ఉంటారు. ముఖ్యంగా యంగ్ హీరోల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్(Ram Charan) మహేష్ బాబు (Mahesh Babu) ఎన్టీఆర్(NTR), ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun), ఇలా స్టార్ హీరోలు ఎంతో  స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య స్నేహం అయితే మరింత బలపడిందని పలు సందర్భాల్లో ఇద్దరూ వెల్లడిస్తునే ఉన్నారు. మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో తారక్ ఒక సీక్రెట్ ను రిలీవ్ చేశాడు. చరణ్ కు, తనకు మధ్య స్నేహం ఎలా పుట్టింది.. తాము ఇద్దరం కలిసి అర్ధరాత్రి ఏమి చేస్తాము వంటి అనేక సీక్రెట్‌ని చెప్పాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, చరణ్‌, జక్కన్న ఉన్నారు. గ్రూప్‌ ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లు చేస్తూ.. సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు.. పర్సనల్ విశేషాలను కూడా పంచుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల దర్శకుడు అనిల్‌ రావిపూడితో జరిగిన గ్రూప్‌ ఇంటర్వ్యూ చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌ ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నాడు. ఎన్టీఆర్ తన ప్రణతి అంటే రామ్‌చరణ్‌ కు భయమని చెప్పడం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

తారక్ .. చెర్రీతో తన స్నేహం గురించి సీక్రెట్‌ని రివీల్‌ చేశాడు. మేము ప్రపంచానికి తెలియకుండా చాలామంది స్నేహితులం. మా మధ్య స్నేహం  ఆర్ఆర్ఆర్ కాదు మొదలైంది.. ఎప్పటి నుంచో ఉందని చెప్పారు తారక్. తనది చెర్రిది భిన్న మనస్తత్వాలు కలిగిన వారమని.. అందుకనే మా మధ్య స్నేహం మంచి బలంగా మారిందని చెప్పాడు తారక్. భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయనే థీరీ తమ మధ్య నిజమని తెలిపాడు తారక్. అంతేకాదు.. ఈ సందర్భంగా చరణ్ నేచర్ గురించి చెబుతూ.. అగ్ని పర్వతం బద్దలైపోతున్నా  చాలా కూల్ గా ఉంటాడని.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎమోషన్స్ ను తనలో దాచుకుంటాడని చెప్పారు తారక్. చెర్రీలోని ఆ క్వాలిటీ తనకు బాగా నచ్చిందని.. మా మధ్య స్నేహం బలపడడానికి ఇదొక కారణమని చెప్పారు ఎన్టీఆర్. అప్పట్లో స్టార్‌ క్రికెట్‌ పోటీ జరుగుతుండేవని.. అప్పుడు తాను, చరణ్‌ కలిసి రాత్రిళ్లు వెళ్లేవాళ్లమని.. అప్పుడు ఇద్దరం అనేక విషయాలను ఒకరికొకరం పంచుకునేవాళ్ళం.

ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్ అంటూ  ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. మార్చి 26 తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు…  ఆ రోజు 12 గంటలకు భార్య ప్రణతి పుట్టిన రోజు తో సెలబ్రేట్‌ చేసుకుని.. వెంటనే అర్ధరాత్రి చరణ్ పుట్టిన రోజు జరుపుకోవడానికి వెళ్లిపోయేవాడినని చెప్పాడు. అప్పటికే తన ఇంటి ముందు చరణ్ కారు రెడీగా ఉండేది.. అప్పుడు నేను సైలెంట్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాడని, ఇలా చాలా సార్లు జరిగిందని ఎన్టీఆర్ చెప్పాడు. అలా అర్ధరాత్రి చరణ్ పుట్టిన రోజు జరుపుకుని ఎంజాయ్ చేసేవాళ్లమని.. చెప్పాడు తారక్.

తన భార్య ప్రణతి ఫోన్ చేస్తే.. వెంటనే తన భార్య ప్రణతి నుంచి ఫోన్‌ వచ్చేదట. మార్చి 26 అయిపోయింది కదా అని తాను చేప్పేవాడినని తారక్ చెప్పాడు. అయితే తన ఇంటి గేట్‌ వద్ద ప్రణతి ఉంటుందేమో అని రామ్‌చరణ్‌ భయపడేవాడట. తమ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను ఫన్నీ మూవ్‌మెంట్స్ పంచుకున్నాడు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు మెగా, నందమూరి అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ దుబాయ్ లో “ఎక్స్ పో 2020 దుబాయ్‌” పేరుతొ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. రేపు (మార్చి 19) సాయంత్రం కర్నాటకలోని చిక్కాబల్లాపూర్‌లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత దేశంలోని తొమ్మిది మెయిన్‌ సీటీస్‌ని ఈ బృందం కవర్‌ చేయబోతుంది.

పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా  తదితరులు నటించారు. డివివి దానయ్య దాదాపు రూ. 478కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read :

AP Heatwave Alert: ఏపీ వాసులకు అలర్ట్‌.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో వడ గాలులు..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సర్జరీ.. ఇంతకు ఏమైందంటే..